»   » ఆర్య-నయనతార... పెళ్లి తర్వాత తీయని జ్ఞాపకాలతో!

ఆర్య-నయనతార... పెళ్లి తర్వాత తీయని జ్ఞాపకాలతో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తమిళ హీరో ఆర్య, హాట్ హీరోయిన్ నయనతార మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ మధ్య ఓ వార్త సంచలనం సృష్టించింది. పలు టీవీ ఛానల్స్ కూడా ఈ విషయంపై ప్రధానంగా ఫోకస్ చేశాయి. అయితే ఆ తర్వాత అదంతా వారి తాజా సినిమా 'రాజారాణి' ప్రచారం నిమిత్తం ఆడిన డ్రామా అని తేలింది.

వీరిద్దరు కలిసి నటిస్తున్న తాజా సినిమా 'రాజారాణి' సినిమా విషయానికొస్తే...ఈ చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారట.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'రాజా రాణి చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్, పెళ్లి తర్వాతి తీయని జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం' అని వెల్లడించారు. ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉందని తెలిపారు.


‘ఇప్పటి యువత పెళ్లి గురించి ఆలచించే తీరు సరిగా లేదు. వారి అభిప్రయాల్లో మార్పు తెచ్చే విధంగా సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు.


ఆర్య, నయనతార పెళ్లయిన జంటగా పర్‌ఫెక్టుగా నటించారు, వారి మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని దర్శకుడు వెల్లడించారు.


సినిమాకు టీమంతా కలిసి ఎంతో కష్టపడి పని చేసారని, వారి సహకారం వల్లనే సినిమా అద్భుతంగా వచ్చిందంటున్నాడు డైరెక్టర్


ఈ చిత్రంలో ఆర్య, నయనతార, జై, సంతానం, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


‘రాజారాణి' చిత్రం ఆడియో ఆగస్టులో విడుదల చేసి, సెప్టెంబర్లో సినిమాను ప్రేక్షకులు ముందుకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగులోనూ ఈచిత్రం విడుదల కానుంది.

English summary
Marked as the most promising of the young directors in the arena, director Atlee of Raja Rani has opened up on the project finally. The interest that this project generated was on par with the expectations of the movies from some of the biggest super stars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu