»   » ఇక్కడ పవన్...అక్కడ నయనతార!

ఇక్కడ పవన్...అక్కడ నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' తెలుగునాట కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలోనే ఈ చిత్రం రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించింది. మరో వైపు తమిళనాట నయనతార నటించిన 'రాజారాణి' సినిమా కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. విశేషం ఏమిటంటే...ఈ రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి.

చాలా కాలం తర్వాత నయనతార తమిళంలో ఆర్యతో కలిసి 'రాజా రాణి' చిత్రంలో నటించింది. సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదలైన ఈచిత్రం తమిళనాడులో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. 2013 సంవత్సరంలో విడుదలైన సినిమాల్లో 4వ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి వీకెండ్‌లోనే రూ. 12.2 కోట్ల వసూళ్లు సాధించింది.

రాజా రాణి చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ సభ్యుల నుంచి ఈచిత్రానికి క్లీన్ U సర్టిఫికెట్ రావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా భారీగా ఈసిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ...ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమాలో మంచి వినోదం ఉండటంతో కలెక్షన్లు జోరు కొనసాగుతోంది. ఆర్య, నయనతార పెళ్లయిన జంటగా పర్‌ఫెక్టుగా నటించారు, వారి మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. రాజా రాణి' చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తోంది.

English summary
Fox Star Studios and AR Murugadoss ' latest venture, Atlee Kumar's Raja Rani starring Arya and Nayanthara has clocked a domestic weekend of 12.2 Cr, making it the fourth biggest opening of the year for a Tamil film and the biggest weekend ever for actor Arya.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu