»   »  రాజశేఖర్ 'సత్యమేవ జయతే'

రాజశేఖర్ 'సత్యమేవ జయతే'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajasekhar
అమితాబ్ బచ్చన్ , రాజ్ కుమార్ సంతోషి ల కాంబినేషన్ లో వచ్చిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఖాకీ'. ఈ సినిమా తెలుగులో 'సత్యమేవ జయతే' పేరుతో రీమేక్ అవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్ పాత్ర రాజశేఖర్ పోషించబోతున్నాడు. ఇక అజయ్ దేవగన్ చేసిన కిల్లర్ పాత్రను చేయడానికి బాలీవుడ్ నటుడు, పేరుపొందిన మోడల్ మిళింద్ సోమన్ అంగీకరించారు. మిళింద్ '16 డిసెంబర్, అగ్నివర్ష, జుర్మ్, భేజా ఫ్రై' వంటి సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు . కాగా ఐశ్వర్యారాయ్, అక్షయ్ కుమార్, తుషార్ కపూర్ చేసిన పాత్రలకి నటుల ఎంపిక జరుగుతోంది. ఇక 'శేషు' తో దర్శకురాలైన జీవిత ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ఆమె 'ఎవడైతే నాకేంటి' ని సముద్రతో కలిసి డైరెక్ట్ చేసి వరస ఫ్లాపుల్లో ఉన్న రాజశేఖర్ కి హిట్టిచ్చి ఉత్సాహాన్నిచ్చింది. ఇలా భారీ అంచనాలతో రేపుతున్నఈ సినిమా మే లేదా జూన్లో సెట్స్ మీదకు వెళ్లనున్నది. ప్రస్తుతం రాజ శేఖర్ వి.ఆర్.ప్రతాప్ దర్శకత్వంలో రెడీ అవుతున్న 'గోరింటాకు' లో చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X