»   » అల్లు అరవింద్ రాజకీయాల వల్లే మగధీర రికార్డులు సృష్టించింది

అల్లు అరవింద్ రాజకీయాల వల్లే మగధీర రికార్డులు సృష్టించింది

Subscribe to Filmibeat Telugu

రాజా నటించిన(ఈయనే నిర్మించాడనే వాదనకూడా వుంది) ఇంకోసారి సినిమా ఎలాంటి టాక్ లేకుండా విడుదలయింది. ఆ తర్వాత సినిమా మంచి కాన్సెప్ట్ తో రూపొందినది అనే టాక్ తెచ్చుకొనేలోపే థియేటర్లలో సినిమా లేకపోయేసరికి రాజా తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. చిన్న సినిమాను చంపేస్తున్నారంటూ, అందుకు సినీ ఇండస్ట్రీలోని నలుగురు పెద్ద దర్శకులే కారణం అంటూ సురేష్ బాబు, దిల్ రాజు, రామోజీరావు, అల్లు అరవింద్ లపైన తీవ్రఆరోపనలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు రాజా టాలీవుడ్ మైల్ స్టోన్ మూవీ మగధీరను టార్గెట్ చేస్తున్నాడు. మగధీర సినిమాను రాష్ట్రవ్యాప్తంగా 1500 థియేటర్లలో విడుదల చేసారు... ఏం ఇంకో సినిమాను ఆడనివ్వరా..? ఆ ఒక్క సినిమా తప్ప ప్రేక్షకులు మరో సినిమాను చూడకూడదా..? అంటూ అల్లు అరవింద్ ను సూటిగా ప్రశ్నించాడు. మగధీర కన్నా మంచి సినిమాలు మన ఇండస్ట్రీలో కోకొల్లలు..వాటిలో ఏ సినిమా కూడా ఈ రేంజిలో ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. ఈయనగారి(అల్లు అరవింద్) దెబ్బకు బయపడి ఏ చిన్న నిర్మాత కూడా వారి సినిమాలను విడుదల చెయ్యలేదు. నిజజీవితంలో రాజకీయాల కన్నా సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువ అంటూ రాజా ఆవేదన వ్యక్తం చేసాడు. ఈయన ఎంత హడావిడి చేసిన ఇంకోసారి సినిమా మాత్రం డిజాస్టర్ మిగిలిపోయింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu