»   » రవితేజ చాలా మారిపోయాడు, ఈ ఫోటో చూసారా?

రవితేజ చాలా మారిపోయాడు, ఈ ఫోటో చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య రవితేజ సినిమాలు రాక పోవడంతో రకరకాల పుకార్లు. రవితేజ పూర్తిగా సినిమాలకు దూరం అవుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. ప్రస్తుతం రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'రాజా ది గ్రేట్) సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ సోమవారం (ఏప్రిల్ 3)న ప్రారంభం అయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. నెక్ట్స్ వీక్ చిత్ర యూనిట్ డార్జిలింగ్ వెలుతోంది. అక్కడ సినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు.

రవితేజ చాలా మారిపోయాడు

రవితేజ చాలా మారిపోయాడు

ఆ మధ్య చాలా బక్క చిక్కి అదో రకమైన లుక్ లో కనిపించిన రవితేజ.... ఈ గ్యాపులో తన బాడీ ఫిట్ నెస్ మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. రవితేజకు సంబంధించిన తాజా ఫోటో ఇది. మళ్లీ మన పాత రవితేజను చూసినట్లు ఉంది కదూ...

రాజా ది గ్రేట్

రాజా ది గ్రేట్

రవితేజ‌, మెహ‌రీన్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా తెరకెక్కుతోంది. వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌ అనేది చిత్ర ఉప శీర్షిక. ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః దిల్ రాజు,

ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో

ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు అని తెలిపారు.

రవితేజ మరో మూవీ టచ్ చేసి చూడు

రవితేజ మరో మూవీ టచ్ చేసి చూడు

దీంతో పాటు రవితేజ బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్ చేసి చూడు' అనే సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ చత్రం ద్వారా విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు.

English summary
After scoring back to back superhits with Pataas and Supreme, director Anil Ravipudi has teamed up withRavi Teja for 'Raja The Great'. The movie has commenced shooting today. The unit will be traveling to Darjeeling next week to shoot a major portion of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu