»   »  ‘రాజా ది గ్రేట్’.... రవితేజ స్టైల్, యాక్షన్ గ్రేట్ అనేలా ఉంది (టీజర్)

‘రాజా ది గ్రేట్’.... రవితేజ స్టైల్, యాక్షన్ గ్రేట్ అనేలా ఉంది (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తన్న చిత్రం 'రాజా ది గ్రేట్'. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈచిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. టైటిల్ కు తగిన విధంగానే సినిమా చాలా గ్రేట్ గా ఉండబోతోందని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

వరుస ప్లాపులతో కాస్త వెనక పడ్డ రవితేజ, 'బెంగాల్ టైగర్' మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసకున్నాడు. రొటీన్ సినిమాలు చేస్తే నొలదొక్కుకోవడం కష్టమని ఊహించి అనిల్ రావిపూడి చెప్పిన విభిన్నమైన స్టోరీకి కమిట్మెంట్ ఇచ్చి త్వరలో 'రాజా ది గ్రేట్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అంధుడిగా రవితేజ

అంధుడిగా రవితేజ

రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుని పాత్రలో కనిపించబోతున్నాడు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.... ఆ నయనాల్లేకుండానే పాతికేళ్ల నుండి కుమ్మేత్తున్నాం ఇక్కడ... మిగతా పార్ట్స్ అమ్మేసుకుంటారా? సర్వేంద్రియానం సర్వం ప్రధానం' అంటూ రవితజ చెప్పే డైలాగుతో టీజర్ ప్రారంభమైంది.

రవితేజ న్యూ లుక్

రవితేజ న్యూ లుక్

లుక్ పరంగా కూడా రవితేజ చాలా మారిపోయాడు. ‘బెంగాల్ టైగర్' సినిమాకు రవితేజ లుక్ విమర్శలు వచ్చాయి. తాజాగా ‘రాజా దిగ్రేట్' సినిమాలోనూ రవితేజ సన్నగానే ఉన్నప్పటికీ లుక్ పరంగా సూపర్బ్ అనేలా ఉన్నాడు.

డైలాగ్స్ అదుర్స్

డైలాగ్స్ అదుర్స్

సినిమాలో డైలాగ్స్ కూడా సూపర్ గా ఉండబోతున్నాయి. " నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేక పోవచ్చు. కానీ నా కొడుకేంటన్నది ఈ ప్రపంచం చూడాలి" అంటూ నటి రాధిక చెప్పిన డైలాగుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఐ యామ్ బ్లైండ్... బట్ ట్రైన్డ్

ఐ యామ్ బ్లైండ్... బట్ ట్రైన్డ్

''అయామ్ బ్లైండ్ .. బట్ అయామ్ ట్రైన్డ్" అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలెట్ అయింది. సినిమాలో ఇలాంటివి ఇంకెన్ని ఉండబోతున్నాయో?

సూపర్ యాక్షన్ సీన్స్

సూపర్ యాక్షన్ సీన్స్

రవితేజ ఈ చిత్రంలో గుడ్డి వాడుగా నటిస్తున్నప్పటికీ అదిరిపోయే యాక్షన్ సీన్లతో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. ఈ చిత్రంలో రవితేజ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

రాజా దిగ్రేట్

రాజా దిగ్రేట్

ఈ చిత్రంలో రవితేజ పేరు ‘రాజా ది గ్రేట్'.... వెల్ కం టు మై వరల్డ్ అంటూ రవితేజ తన అభిమానులను ఈ సినిమాకు ఆహ్వానిస్తున్నాడు. గుడ్డి వాడు తనకు ఎదురైన ఆటంకాలను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ హీరోగా, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప‌టాస్‌, సుప్రీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తెరకెక్కించిన అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `రాజా ది గ్రేట్`. `వెల్‌క‌మ్ టు మై వ‌ర‌ల్డ్‌` క్యాప్ష‌న్‌.

దిల్ రాజు

దిల్ రాజు

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``ర‌వితేజతో భ‌ద్ర సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా రాజాది గ్రేట్‌. అలాగే డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో సుప్రీమ్ త‌ర్వాత చేస్తున్న సినిమా ఇది. ఈ రెండు సినిమాల‌ను దాటి ఈ సినిమా పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ అవుతుంది`` అన్నారు.

అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ``ర‌వితేజ‌గారితో చేస్తున్న డిప‌రెంట్ కాన్సెప్ట్ మూవీ. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజగారు చేయ‌ని విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ‌తారు. ర‌వితేజ‌గారి అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.

మెహరీన్

రవితేజ, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌ణః దిల్ రాజు, నిర్మాతః శిరీష్‌, క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః అనిల్ రావిపూడి.

English summary
Watch Raja The Great Teaser Official Teaser. Ravi Teja, also known as Mass Maharaja, is back in his elements with Raja The Great. The filmmakers released the first glimpse of Ravi Teja's film, in which the actor plays a blind man. But wait, don't you dare think that you can take advantage of him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu