»   » 'ఆనంద్‌' రాజా ఆఫర్స్ లేక అలా

'ఆనంద్‌' రాజా ఆఫర్స్ లేక అలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరో రాజా. ఆ చిత్రం తర్వాత దాదాపు ఓ పది చిత్రాల్లో నటించినా హిట్ రాలేదు.దాంతో వరస ప్లాపుల హీరోకు తెలుగు సినిమా బ్రేక్ ఇచ్చి ఇంట్లో కూర్చో పెట్టింది. దాంతో మరీ ఖాళీ పడిపోయామని గమనించిన రాజా తన దృష్టిని తెలివిగా టీవీ యాంకరింగ్ వైపు తిప్పారు. ఇక రాజా ఖాళీ పడటానికి కారణాలు అనేకం.ముఖ్యంగా సినిమాలు వరసగా ప్లాప్ అవటం కారణం. వీటితో పాటు సక్సెస్ రేటు లేకున్నా రెమ్యునేషన్ మాత్రం భారీగా అడగటం జరిగింది. మరో ప్రక్క శాటిలైట్ మార్కెట్ కూడా రాజా అస్సలు లేకుండా పోయింది. దాంతో రాజా అంటే ఏ దర్శకుడూ, నిర్మాత ధైర్యం చేయటం లేదు. ఈ నేపద్యంలో టీవీ యాంకర్ గా రాజా మారటం మంచి నిర్ణయమేనంటున్నారు. సంవత్సరాల తరబడి ఏదో ఎప్పుడో జరుగుతుందని ఆశతో ఎదురుచూసే చాలా మంది కన్నా ఇలా ముందే మేలుకుని తామెంటే తెలుసుకుని నెక్ట్స్ స్టెప్ చూసుకోవటం మంచి పరిణామం అంటున్నారు. మరి రాజా ని చూరి ఎంతమంది అనుసరిస్తారో చూడాలి.

English summary
Anand fame Raja has no offers. So he wants to become TV anchor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu