twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రమోషన్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది: రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్ :"ప్రమోషన్ ప్రాముఖ్యత తెలిసొచ్చింది. 'అందాల రాక్షసి' ప్రమోషన్‌లో భాగంగా సినిమా విడుదల వరకు ఈ చిత్రంలోని నటీనటులు షాపింగ్ మాల్స్‌లో, కాఫీ షాపుల్లో సందడి చేస్తారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్యూర్ లవ్‌స్టోరీ ఇది'' అని రాజమౌళి చెప్పారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అందాల రాక్షసి'. నవీన్‌చంద్ర, రాహుల్‌ కథానాయకులు. లావణ్య నాయిక. సాయి కొర్రపాటి, ఎస్‌.ఎస్‌.రాజమౌళి నిర్మాతలు. ఈ నెల 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా మీడియాతో మచ్చుటిస్తూ ఇలా స్పందించారు.

    ఇక దర్సకుడు మాట్లాడుతూ..ఎవరి అనుమతీ అవసరం లేదన్నట్టుగా... ఉదయం వాకిలి తీయగానే ఇంట్లోకి చొరబడతాడు సూర్యుడు. వెలుగుని పంచుతాడు. అచ్చం అలాంటి మనస్తత్వమే ఉన్న యువకుడు సూర్య. నలుగురికి సంతోషాన్ని పంచిపెట్టడంలోనే తన ఆనందాన్ని వెదుక్కొంటాడు. అందరూ వృథా అన్న వస్తువుకు కూడా ప్రాణం పోస్తాడు. అలాంటి యువకుడి జీవితంలోకి ఓ అందాల భామ వస్తుంది. మరి ఆ అమ్మాయిని రాక్షసి అని ఎందుకన్నాడో తెరమీదే చూడాలి. సినిమా ప్రారంభమైన రోజు నుంచి అత్యంత శ్రద్ధతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. అందరూ చాలా నేచురల్‌గా నటించారు. నా నమ్మకమే నాకు శక్తినిచ్చింది. రాజమౌళిగారు, దిల్‌రాజుగారు ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. అందాల రాక్షసి హిట్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు.

    ఈ సినిమా పంపిణీ చేస్తున్న దిల్‌రాజు మాట్లాడుతూ ''చాలా రోజుల తర్వాత ఒక కొత్త తరహా సినిమాని చూసిన అనుభూతి కలిగింది. దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ కొత్తవారైనా హనుమంతు చక్కగా చిత్రీకరించాడు. అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ నెల 10న ఈ చిత్రం విడుదలవుతోంది. విజయం సాధించాలని కోరుకుంటున్నా''అన్నారు.

    ''నేను పోషించిన సూర్య అనే పాత్ర కోసం యేడాది పాటు కష్టపడ్డాను. ఇప్పటికీ ఆ పాత్రలోనే జీవిస్తున్నాన''న్నారు నవీన్‌చంద్ర. మంచి పాత్రల్లో, ఎంతో కష్టపడి చేశామని రాహుల్, లావణ్య అన్నారు. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేశారు.ఈ చిత్రం ట్రైలర్స్‌కు, ఆడియోకు మంచి స్పందన వస్తోంది. దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జి.మురళి, సంగీతం: రధన్‌

    English summary
    
 ‘Andhala Rakshasi’ movie will be relesing on 10th of this month. The film has completed its censor formalities and it has been awarded a U/A Certificate. Hanu Raghavapudi is the director of the movie and this is his debut film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X