twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వాటిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను: రాజమౌళి

    By Srikanya
    |

    హైదరాబాద్ : "సినిమా చేసేటప్పుడు అవార్డుల గురించి ఎప్పుడూ ఆలోచించను. వాటిని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోను. ప్రకటించారని తెలిసినప్పుడు సంతోషంగా ఉంటుంది'' అని అన్నారు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన 'ఈగ' జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ విజువల్స్ ఎఫెక్ట్స్‌కు కూడా అవార్డును కైవసం చేసుకుంది. జంట అవార్డులను దక్కించుకున్న 'ఈగ' దర్శకుడు రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే...నేను నిద్రపోతుంటే 'బాహుబలి' నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఫోన్ చేసి 'ఈగ'కు అవార్డులు వచ్చాయని చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్‌కు వచ్చినందుకు ఆనందమే. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి అవార్డుల గురించి చాలా మంది మాట్లాడారు కానీ నేను పట్టించుకోలేదు. నా దృష్టిలో 'ఈగ' సినిమా పూర్తయింది. ఇప్పుడు 'బాహుబలి' మీదే నా దృష్టి అన్నారు.

    ఇక జాతీయ అవార్డు వచ్చినంత మాత్రాన తెలుగు సినిమా స్థాయి పెరిగిందని నేననుకోను. మామూలుగానే ప్రతి సినిమాకూ మన స్థాయి ఏదో విధంగా పెరుగుతూనే ఉంటుంది. 'ఈగ'కు ఆస్కార్ నామినేషన్ అనీ, మరోటనీ అన్నప్పుడు 'జోక్‌లు వేసుకోకూడదు' అనుకున్నాను. నా దృష్టిలో 'ఈగ' మన ఇండియన్ స్థాయిలో మంచి సినిమా అని అన్నారు.

    ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం పెట్టిన రూ.7 కోట్లకు పైగా ఖర్చు.. ఇప్పుడు జాతీయ అవార్డుల రూపంలో ఫలితాన్నివ్వడం 'ఈగ' యూనిట్‌ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతోంది. ఈ సినిమాలో 'ఈగ'ని హైదరాబాద్‌లోని మకుట ఎఫెక్ట్స్‌కు చెందిన యానిమేటర్లు చిత్రీకరించారు. మకుట సహ వ్యవస్థాపకుడు పీట్ డ్రేపరహ్.. 'ఈగ' స్పెషల్ ఎఫెక్ట్స్ టీమ్‌కి నేతృత్వం వహించారు. 137 నిమిషాల ఈ సినిమాలో 90 నిమిషాలు గ్రాఫిక్సే! అందులో.. 2,234 లైవ్ యాక్షన్ యానిమేషన్ షాట్లున్నాయి! భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక రికార్డు.

    English summary
    Eega film has got two national awards. It has been selected as best regional film and also got award for special effects. Rajamouli happy with these awards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X