»   » అంత ఈజీ అనుకుంటన్నారా?: రాజమౌళి

అంత ఈజీ అనుకుంటన్నారా?: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు ..హాలివుడ్ లో చిత్రం చేయటం అని సురేష్ బాబు చెప్పిన రోజు నుంచి ఆ హాలీవుడ్ ప్రాజెక్టుపై రకరకాల రూమర్స్ మీడియాలో మొదలయ్యియి. ఏకంగా ఓ ఇంగ్లీష్ డైలీ మరింత ముందుకు వెళ్లి జెట్లీ, రణబీర్ కాంబినేషన్ లో ఈ చిత్రం చేయనున్నారని, బాహుబలి పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్టు మొదలవుతుందంటూ ఆర్టికల్ రాసేసింది. దాంతో రాజమౌళి వచ్చి ఈ రూమర్ ని ఖండించ తప్పలేదు.

రాజమౌళి ట్వీట్ చేస్తూ.. "జెట్ లీ? రణబీర్? ఇవన్నీ ఎక్కడ నుంచి పుడుతున్నాయి.?? హాలీవుడ్ కూడాను..? అక్కడికి టిక్కెట్ తీసుకుని ప్లేన్ ఎక్కినంత ఈజీగా చెప్తున్నారు. బాహుబలి పూర్తయ్యేంతవరకూ నేను వేరే దాని గురించి ఆలోచించేటంత తీరక లేదు...అలాంటిదేమన్నా ఉంటే నేనే డిక్లేర్ చేసి చెప్తాను.. ధాంక్యూ .." అంటూ ఖండించారు.

Rajamouli about Hollywood Film

ప్రస్తుతం రాజమౌళి..బాహుబలి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

English summary
Rajamouli tweeted: "Jet li? Ranabir? Where did this spring up from.?? And Hollywood..? As if it is as easy as taking a ticket and boarding the plane. Until Baahubali is completed I don't have time for anything else. I would declare myself if anything props up. Thank you.."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu