»   » రజనీ ‘కబాలి’ టీజర్‌పై దర్శకడు రాజమౌళి ఇలా...

రజనీ ‘కబాలి’ టీజర్‌పై దర్శకడు రాజమౌళి ఇలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ టీజర్ మేడే సందర్భంగా రిలీజైన సంగతి తెలిసిందే. ఊహించిన విధంగానే టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్లో ముఖ్యంగా రజనీకాంత్ లుక్ అదిరిపోయే విధంగా ఉంది.

'తెలుగు చిత్రాల్లో ఇక్కడ గాటు పెట్టుకొని, మీసాలు మెలితిప్పుకొని, లుంగీ కట్టుకొని పాత విలన్‌ కబాలి అని పిలవగానే వచ్చి ఒంగొని వినయంగా 'ఎస్‌... బాస్‌' అని నిలబడతాడే ఆ కబాలి అనుకొన్నార్రా?... కబాలి రా' అంటూ రజనీ అదరగొట్టారు.

టీజర్లో రజనీకాంత్ స్టైల్, ఆయన డైలాగ్ డెలీవరీ తీరు, మాస్ అప్పియరెన్స్ అదిరిపోయిందని అంటున్నారంతా, అభిమానులైతే 'బాష' రేంజిలో ఉంటుందని ఊహించుకుంటున్నారు. యూట్యూబులో విడుదలైన ఈ ట్రైలర్‌కు గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనాల్లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయని.

Rajamouli about Kabali teaser

బాహుబలి దర్శకుడు రామజమౌళి కూడా 'కబాలి' టీజర్ ను పొగుడుతూ ట్వీట్ చేసారు. టీజర్ ఆయనకు బాగా నచ్చడంతో.....దిస్ ఈజ్ స్టైల్, దిస్ ఈజ్ రజనీ, దిస్ ఈజ్ తలైవా అని పొగుడుతూ ట్వీట్ చేసారు.


'కబలి' చిత్రాన్ని కలైపులి. ఎస్‌.థాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమాను మే 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మూవీలో రజనీకాంత్ పూర్తి పేరు కబాలీశ్వరన్. అంతా కబాలి అని పిలుస్తుంటారు. రజనీతో పాటు రాధిక ఆప్టే, దినేష్ రవి, కలైయ్యారసన్, ధన్సిక, కిషోర్, జాన్ విజయ్, రిత్విక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
After the release of Kabali's teaser, appreciations on twitter were received ... handle as well, whereas SS Rajamouli has tweeted "THIS is style ! THIS is rajini !! THIS is thalaiva !!!.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu