»   » ‘మనమంతా’ మూవీ సూపర్బ్... అంటూ రాజమౌళి రివ్యూ!

‘మనమంతా’ మూవీ సూపర్బ్... అంటూ రాజమౌళి రివ్యూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదారబాద్: టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి జడ్జిమెంటుకు టాలీవుడ్లో చాలా విలువ ఉంది. ఆయన ఏదైనా సినిమా చూసి బావుంది అంటూ కామెంట్ చేసారంటే ఆ సినిమా సూపర్ హిట్టే. ఎందుకంటే రాజమౌళి జడ్జిమెంటు మీద ప్రేక్షకులకు అంత నమ్మకం.

చాలా మంది ఆయన మాటపై నమ్మంతోనే సినిమా చూసేందుకు వెళతారు అంటే అతిశయోక్తి కాదేమో. ఇటీవల పెళ్ళి చూపులు సినిమా చూసిన రాజమౌళి సినిమా అదిరిపోయిందంటూ మెచ్చుకున్నారు. ఈ సినిమా నిజంగానే బాక్సాఫీసు వద్ద అదరొడుతోంది. ఇప్పుడు తన స్నేహితుడు యేలేటి తీసిన ''మనమంతా'' సినిమాపై తన ప్రశంసల జల్లు కురిపించాడు.


'మనమంతా' సినిమా చూసిన రాజమౌళి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం మనమంతా.


మధ్యతరగతి జీవుల జీవితాన్ని ప్రతిబింభిస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మనం నిత్య జీవితంలో రోజూ చూసే అంశాల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుంది. మరి ఈ సినిమా గురించి రాజమౌళి ఏమన్నారు? ఎలాంటి అభిప్రాయాలు వెలుబుచ్చారు అనే వివరాలు స్లైడ్ షోలో...


టాప్ క్లాస్ ఫిల్మ్

టాప్ క్లాస్ ఫిల్మ్

''మనమంతా సినిమా చంద్రశేఖర్ ఏలేటి కెరీర్లో, వారాహి చలన చిత్రం బేనర్లో టాప్ క్లాస్ సినిమాగా మిగిలిపోతుందని రాజమౌళి తెలిపారు.


రాబట్టుకున్నాడు

రాబట్టుకున్నాడు

నటీనటుల వద్ద నుండి తనకు కావాల్సినట్టుగా పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడని రాజమౌళి తెలిపారు.


మోహన్ లాల్ నుండి 4 ఏళ్ల కుర్రాడి వరకు

మోహన్ లాల్ నుండి 4 ఏళ్ల కుర్రాడి వరకు

సినిమాలో మోహన్ లాల్ నుండి నాలుగేళ్ల చిన్నారి వరకు తమ తమ పాత్రల్లో నవ్విస్తారూ ఏడిపిస్తారూ అలాగే మన గుండెల్లో చిరకాలం ఉండిపోతారు అని రాజమౌళి తెలిపారు.


పాఠ్య పుస్తకంలా

పాఠ్య పుస్తకంలా

ఫిలిం స్టూడెంట్లకు ఒక పాఠ్య పుస్తకంలా ఈ సినిమా ఉంటుందన్నారు రాజమౌళి.


గర్వంగా..

గర్వంగా..

సినిమాకోసం పనిచేసిన వారందరూ.. సగర్వంగా మేము మనమంతా సినిమాకు చేశాం అని చెప్పుకోవచ్చు అంటూ టీం అందరికీ కంగ్రాట్ చెప్పారు రాజమౌళి.


English summary
"Manamantha will remain a top class film in the career of Chandu and Vaaraahi Chalana Chitram. Chandu has a knack of extracting fantastic performances from his actors. From a seosoned actor like Mohanlal garu to a 4 year old kid every one will make you smile laugh and cry and will remain in our hearts and thoughts for a very long time. The way the film began the way it was weaved and the way it ended is a text book for every film student. Congratulations to the entire unit. Everyone who worked in the film can proudly say he/she is a member of Manamantha." Rajamouli said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu