»   »  ఆయన వల్ల మాపై ఒత్తిడి పెరిగిందన్న రాజమౌళి

ఆయన వల్ల మాపై ఒత్తిడి పెరిగిందన్న రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. దర్శకుడు రాజమౌళి వివిధ మీడియా సంస్థల ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తున్నారు.

సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నకిద్దీ టెన్షన్ పెరిగి పోతోందని, లోపలి ఒత్తిళ్లను కవర్ చేసుకోవడానికి బలవంతంగా నవ్వాల్సి వస్తోందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ చిత్రానికి సమర్పకుడిగా ఉన్న రాఘవేంద్రరావు ఇంత వరకు సినిమాను చూడలేదని, దీంతో తమపై ఒత్తిడి రెట్టింపయిందని రాజమౌళి చెప్పారు.

Rajamouli about Raghavendra Rao

బాహుబలి సినిమా మొత్తం బాహుబలి పాత్రతో ముడిపడి ఉంటుందని, ఆ పాత్రకు ప్రభాస్ ను మినహా వేరొకరిని ఊహించుకోవడం కష్టమని రాజమౌళి అన్నారు. తెలుగులో ఈ చిత్రం 100 కోట్ల మార్కు దాటుతుందనే ధీమా వ్యక్తం చేసిన రాజమౌళి విడుదల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు.

సినిమాలో పాత్రల పేర్లు డిపరెంటుగా ఉన్నాయని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ...నాన్నగారు పాత్రలకు చిత్రమైన పేర్లు పెడుతుంటారు. గతంలో ఆయన కాట్రాజ్, టిట్లా లాంటి డిఫరెంట్ నేమ్స్ పెట్టారు. అదే తరహాలో బాహుబలి, భళ్లాలదేవ, బిజ్జలదేవ, కాలకేయ, శివగామి లాంటి డిఫరెంట్ పేర్లు పెట్టారు. బాహుబలి కథ కంటే ముందే పాత్రల పేర్లు పుట్టాయని రాజమౌళి తెలిపారు.

English summary
Baahubali movie director Rajamouli comments about Raghavendra Rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu