For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  RRR: తారక్, చరణ్ ఫ్యాన్స్ హర్టవుతారని ఆలోచిస్తే కథలో రసం ఉండదన్న రాజమౌళి

  |
  #RRRPressMeet || Rajamouli Reveals Interesting Facts About RRR Movie || NTR || Ram Charan

  'ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఈ చిత్రంలో నటించే హీరోయిన్లు, ముఖ్య తారాగణం ఎవరు? సినిమా కాన్సెప్టు ఏమిటి? ఇలా అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు రాజమౌళి. ఈ సందర్భంగా పాత్రియేలు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు.

  చరిత్రలోని ఇద్దరు గొప్ప వ్యక్తులను స్పూర్తిగా తీసుకుంటున్నపుడు.. వారి జీవిత చరిత్ర తాలూకు గొప్పదనం, ఘనత ఎక్కడా సఫర్ అవ్వకూడదు. ఈ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? అనే ప్రశ్నకు స్పందిస్తూ... ''నేను మామూలుగా మన హీరోలనే సూపర్ హ్యూమన్ లెవల్‌లో చూపిస్తాను. రియల్ హీరోలను ఎంత సూపర్ లెవల్లో నిల్చోపెడతానో మీరే ఆలోచించండి.'' అని వ్యాఖ్యానించారు.

  వివాదాలు ఎప్పుడూ ఉంటాయి

  వివాదాలు ఎప్పుడూ ఉంటాయి

  వివాదాలు ఎప్పుడూ ఉంటాయి. అల్లూరి సీతారామరాజు చిత్రం కృష్ణ గారు చేసినపుడు వివాదాలు వచ్చాయి. వివాదాలు వస్తే తీయడం మానేయాలా? అన్నమయ్య సినిమా సమయంలో కూడా ఇలానే జరిగింది. వివాదాలు వచ్చాయని భయపడి మన వద్ద ఉన్న అద్భుతమైన సినిమాను తీయడం మానకూడదని నా అభిప్రాయమని రాజమౌళి తెలిపారు.

  అలా చేస్తే సినిమాలో రసం ఉండదు

  అలా చేస్తే సినిమాలో రసం ఉండదు

  ఇద్దరు టాప్ స్టార్ డమ్ హీరోలను పక్కపక్కన పెట్టి మల్టీ స్టారర్ సినిమా చేసినపుడు ఫ్యాన్స్ హర్టవుతారేమో? మా హీరోకు తక్కువ సీన్లు ఉన్నాయని ఫీలవుతారేమో? అని ఫైట్లు, సీన్లు ఇద్దరికీ సమానంగా పంచుకుంటూ వెళితే కథలో రసం అనేది కంప్లీగ్‌గా వెళ్లిపోతుందన్నారు.

  ‘ఆర్ఆర్ఆర్' రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రెస్ మీట్, గుడ్‌లక్ చెప్పిన ఉపాసన!

  బ్యాలెన్స్ అనేది ఆ విషయంలో ఉండాలి

  బ్యాలెన్స్ అనేది ఆ విషయంలో ఉండాలి

  ఫిల్మ్ మేకర్‌గా కథ బావుందా? లేదా? అనేది నాకు ముఖ్యం. ఆడియన్స్ సినిమా థియేటర్‌కు వచ్చిన 10 నిమిషాల్లో చరణ్, తారక్ ఇద్దరినీ మరిచిపోయి నేను చూపించే క్యారెక్టర్లను చూడగలరా? లేదా? అలాంటి సీన్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంది నమ్మిన తర్వాతే సినిమా మొదలు పెడతాం. బ్యాలన్స్ అనేది ఉండాలి కానీ సాంగ్స్, ఫైట్స్ విషయంలో కాదు. ఆడియన్స్ మనసుకు హత్తుకునే లెవల్స్ లో బ్యాలెన్స్ ఉండాలి.

  ఇద్దరూ నచ్చే విధంగా పాత్రలు

  ఇద్దరూ నచ్చే విధంగా పాత్రలు

  ఒకరిని ఎక్కువ ఇష్టపడి, ఒకరిని తక్కువగా ఇష్టపడే విధంగా పాత్రలు ఉంటే అన్ బ్యాలెన్స్ స్టోరీ అవుతుంది. ఇది అన్ బ్యాలెన్స్ స్టోరీ కాదు. సినిమా పూర్తయ్యే సమయానికి కొమురం భీం పాత్రలో తారక్ ఎంత నచ్చుతాడో చరణ్ కూడా అల్లూరి పాత్రలో ఈక్వల్‌గా నచ్చుతాడు. ఇద్దరి మీద ఆడియన్స్ కు సమానమైన ఎంపథీ ఉంటుంది. దాంట్లో నేను సరిసమానమైన బ్యాలెన్స్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటాను.

  హీరో, హీరోయిన్, విలన్ అన్నీ ఆ ఇద్దరే

  హీరో, హీరోయిన్, విలన్ అన్నీ ఆ ఇద్దరే

  ఇద్దరూ హీరోలకు ఒకటే విలన్ ఉంటాడా? వేరే వేరే విలన్స్ ఉంటారా? అనే ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ... కథ పూర్తయిన తర్వాత మేము ముగ్గురం డిస్క్రషన్ చేసుకున్నది ఏమిటంటే ఇందులో హీరో, విలన్ వారే... హీరో హీరోయిన్ వారే. ఈ స్టోరీ ఈ ఇద్దరి గురించే. ఇతర క్యారెక్టర్లు అన్నీ సపోర్టింగ్‌గా ఉంటాయన్నారు.

  అదే మాకు ప్లస్ అయింది

  అదే మాకు ప్లస్ అయింది

  సినిమా స్టార్ట్ చేయక ముందు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం గురించి తెలిసున్న కథలు, రచనలు చదివాం. అథంటికేటెడ్‌గా ఉన్న వాటిలో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఉండి ఉంటే మేము ఎక్కువ వర్రీ అయ్యేవారం. లేదు కాబట్టి కంప్లీట్ ఫ్రీడం వచ్చినట్లయింది. వారు కనిపించకుండా వెళ్లిన గ్యాపులో ఏం జరిగిందనేది మాకు ఎలా కావాలంటే అలా ప్రజంట్ చేసే అవకాశం వచ్చింది. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ, రియాల్టీ అనేది లేదని రాజమౌళి స్పష్టం చేశారు. .

  English summary
  Rajamouli about Ram Charan and NTR characters balancing in RRR movie. Director SS Rajamouli is holding a press meet on March 14 to announce the title, release date and the details of cast and crew of his movie RRR starring Jr NTR and Ram Charan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more