»   » పెద్ద జోక్ అంటూ రాజమౌళి కోపం,ఆవేదన

పెద్ద జోక్ అంటూ రాజమౌళి కోపం,ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తాజా చిత్రం బాహుబలి రికార్డులు బ్రద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ చిత్రానికి పైరసీ బాధ తప్పలేదు. ఆన్ లైన్ లో ఈ చిత్రం పైరైటెడ్ వెర్షన్ దొరుకుతోంది. దాంతో ఈ విషయమై రాజమౌళి చాలా కోపంగా ఉన్నారు. ట్విట్టర్ లో తన ఆవేదన వ్యక్తం చేసారు.


మన దేశంలో ఎన్ఫోర్స్ మెంట్ చట్టాలు పనిచేయవు..చట్టాలు అమల్లో పెట్టడం పెద్ద జోక్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఈ విషయమై ఆయన అభిమానుల సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. రోడ్ల మీదే బాహుబలి సీడీలు దొరుకుతున్నాయని ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు.


బాహుబలి విడుదలై 50 రోజులు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళం, మళయాలం, హిందీ, ఫ్రెంచి భాషల్లో ఈ సినిమా జులై 10న ప్రేక్షకులను పలకరించింది. విడుదలైంది మొదలు బాక్సాఫీసు వద్ద కనక వర్షం కురిపిస్తూ భారత చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. విడుదలైన మొదటి రోజే 68 కోట్లను వసూలు చేసింది.


Rajamouli angry on Baahubali Piracy

భారత్‌లో అన్ని భాషలను కలుపుకొని మొదటి వారం 178 కోట్లను, ప్రపంచవ్యాప్తంగా 255 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. మొదటి వీకెండ్‌లో 162 కోట్లను రాబట్టిందీ చిత్రం. 9 రోజుల్లోనే 300 కోట్లను రాబట్టి ఆ క్లబ్‌లో చేరిన మొదటి దక్షిణాది చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 401 కోట్లను 15 రోజుల్లోనే రాబట్టింది. తదనంతరం 500 కోట్ల క్లబ్‌లో చేరింది.


ఈ క్రమంలో హిందీ వర్షెన్‌లో 100 కోట్లకు పైగా వసూలు చేసి ఆ ఘనత సాధించిన మొదటి డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. భారత్‌లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది బాహుబలి. ఇప్పటి వరకు 600.95 కోట్లను బాహుబలి వసూలు చేసినట్లు ఓ అంచనా.


English summary
Rajamouli ss tweeted: "Sadly, law enforcement is a joke In our country. myself am eager to watch CNN IBN's take on piracy"
Please Wait while comments are loading...