»   » దయచేసి ‘బాహుబలి-2’ అడ్డుకోవద్దు, నష్టపోతాం: రాజమౌళి (వీడియో)

దయచేసి ‘బాహుబలి-2’ అడ్డుకోవద్దు, నష్టపోతాం: రాజమౌళి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బాహుబలి-2' రిలీజ్ అడ్డుకుంటామని కర్నాటకలో ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్ర దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా ఆందోళన కారులను వేడుకున్నారు. కన్నడలో మాట్లాడిన వీడియోను పోస్టు చేసారు.

'త‌న‌కు కన్నడ సరిగా రాదని, ఏవైనా తప్పులుంటే క్షమించాల‌ని మొద‌ట‌గా వ్యాఖ్యానించిన రాజ‌మౌళి.... తమకు సంబంధం లేని వివాదానికి తమ సినిమాను బలి చేయవద్దన్నారు. చాలా ఏల్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న‌ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేన‌ని, ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో బాహుబలి బృందానికి ఎటువంటి సంబంధం లేదన్నారు రామజౌళి. బాహుబ‌లి చిత్రం కోసం ఎంతో మంది నటీనటులు, టెక్నీషియ‌న్స్ ఎంతో కష్టప‌డ్డార‌ని, ఈ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. బాహుబలి-1ను ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2ని కూడా ఆదరించాలని ఆయ‌న వీడియో ద్వారా కోరారు.


రాజమౌళి పోస్టు చేసిన వీడియో ఇదే..

కర్నాటకలో సినిమా విడుదల ఆగిపోతే దాదాపు రూ. 20 నుండి 30 కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకే రాజమౌళి స్వయంగా రంగంలోకి దిగి ఆందోళన కారులను శాంతింపచేసే ప్రయత్నం చేసారు.


ఇదీ వివాదం

ఇదీ వివాదం

ఈ వివాదానికి కారణం కావేరీ జలవివాదం. బాహుబలి-2 మూవీలో నటించిన సత్యరాజ్ ఈ వివాదానికి సంబంధించి గతంలో కన్నడిగులను అవమానించే విధంగా కామెంట్స్ చేసారని, ఇపుడు ఆయన క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ఆయన నటించిన బాహుబలి-2 సినిమా విడుదలను అడ్డుకుంటామని కన్నడ నాయకులు హచ్చరిస్తున్నారు.


బాహుబలి-2 పెద్ద సినిమా కావడం వల్లనే

బాహుబలి-2 పెద్ద సినిమా కావడం వల్లనే

9 ఏళ్ల క్రితం సత్యరాజ్ కామెంట్స్ చేసిన తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. బాహుబలి పార్ట్ 1 కూడా రిలీజైంది. అప్పుడు ఎలాంటి వివాదం లేదు. ఇపుడు సడెన్ గా తెరపైకి వివాదం రావడానికి కారణం బాహుబలి భారీ బడ్జెట్ సినిమా కావడమే.


క్షమాపణ చెప్పిస్తే అక్కడ సమస్య

క్షమాపణ చెప్పిస్తే అక్కడ సమస్య

ఒక వేళ సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెబితే తమిళనాడులో ఆయనకు కావేరి సెగ తగులే అవకాశం ఉంది. సత్యరాజ్ క్షమాపణ చెబితే తమిల ప్రేక్షకులు, ప్రజలు ఆయనపై వ్యతిరేకత పెంచుకునే అవకాశం ఉంది.English summary
Ace filmmaker SS Rajamouli took to Twitter to post a video which shows him appealing to Kannadigas to allow the release of the second half of his magnum opus- Baahubali 2 – in Karnataka on April 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu