»   »  రాజమౌళి, దానయ్య సినిమా కథ రెడీ.. మళ్లీ ప్రభాస్‌తో జక్కన్న.. ఏడాది చివర్లో!

రాజమౌళి, దానయ్య సినిమా కథ రెడీ.. మళ్లీ ప్రభాస్‌తో జక్కన్న.. ఏడాది చివర్లో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సంచలన విజయం తర్వాత ఫ్యామిలీ వెకేషన్ ముగించుకొని వచ్చిన దర్శకుడు రాజమౌళి తన తదుపరి చిత్రానికి సంబంధించిన వర్క్‌పై దృష్టిపెటాడు. దాదాపు మరో ఆరు నెలలపాటు స్క్రిప్ట్ వర్క్ చేయనున్నారనేది తాజా సమాచారం. బాహుబలి తర్వాత ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణ సారథ్యంలో రాజమౌళి సినిమా చేయడానికి ఒప్పందం కుదిరింది. గతంలో దేశముదురు, జులాయి, నాయక్ లాంటి చిత్రాలను దానయ్య నిర్మించిన సంగతి తెలిసిందే. బాహుబలి2 రిలీజ్‌కు ముందే జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.

యాక్షన్, రివేంజ్ డ్రామా

యాక్షన్, రివేంజ్ డ్రామా

రాజమౌళి దర్శకత్వం వహించబోయే సినిమా యాక్షన్, రివేంజ్ డ్రామా అనేది ప్రాథమిక సమాచారం. ఈ సినిమా కథపై ఇప్పటికే రాజమౌళి కసరత్తు ప్రారంభించాడట. బాహుబలి తర్వాత భారీ అంచనాలు నెలకొనడంతో ఆ స్థాయికి తగ్గకపోయినా తదుపరి చిత్రం సెన్సేషనల్ హిట్ కావాలనే పట్టుదలతో జక్కన ఉన్నట్టు తెలుస్తున్నది.

స్టోరి లాక్ చేసిన జక్కన్న

స్టోరి లాక్ చేసిన జక్కన్న

డీవీవీ దానయ్య, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కథను లాక్ చేశారు. అనుకొన్న ప్రణాళిక ప్రకారం ముందుకెళితే ఈ ఏడాది చివరికల్లా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఇప్పటికే రాజమౌళి కథపై కసరత్తు ప్రారంభించారు. మరో ఆరు నెలలపాటు కథపై వర్క్ చేయనున్నారు అని చిత్ర యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి.

స్క్రిప్ట్ ఫైనలైజ్ తర్వాతనే..

స్క్రిప్ట్ ఫైనలైజ్ తర్వాతనే..

తన చిత్రానికి సంబంధించినంత వరకు ఇంకా హీరో, హీరోయిన్లు, ఇతర పాత్రల ఎంపిక జరుగలేదు. సాధారణంగా కథ, స్క్రిప్ట్ ఫైనలైజ్ అయిన తర్వాతనే హీరో, హీరోయిన్ల ఎంపిక గురించి రాజమౌళి ఆలోచిస్తారు అని వారు పేర్కొన్నారు. అయితే దానయ్య నిర్మించే సినిమాలో ప్రభాస్ హీరో అనే వార్త ఫిలింనగర్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది.

ప్రభాస్‌తోనే తదుపరి సినిమా..

ప్రభాస్‌తోనే తదుపరి సినిమా..

బాహుబలి2 తర్వాత ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ సినిమానే. దాంతో ఈ చిత్రానికి ప్రభాస్ చాలా డిడికేటివ్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ కుదురడానికి వీలు కలుగుతుందా అనే ప్రశ్నను పలువురు లేవనెత్తుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్తున్నందున ఆ కాంబినేషన్ కుదిరే అవకాశం లేకపోలేదనే మరో వాదన.

బాహుబలి రేంజ్ కాదట..

బాహుబలి రేంజ్ కాదట..

దానయ్య నిర్మించబోయే సినిమా బాహుబలి రేంజ్ బడ్జెట్ కాదని, ఆ సినిమా టాలీవుడ్ స్థాయిలోనే ఉంటుంది. తెలుగు సినిమాల పరిధిలోనే రాజమౌళి చిత్రం తెరకెక్కనున్నది. హీరో, హీరోయిన్లు ఎంపిక పూర్తయితే తప్పా ఆ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనే చెప్పలేం అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
The excitement over SS Rajamouli’s Baahubali is just about coming to an end but the ace Telugu filmmaker has already begun work on his next. After coming from family holiday in London, filmmaker SS Rajamouli is back to work mode. He has quickly moved on to his next project. DVV Danayya producing Rajamouli’s next which will be an action-based revenge drama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu