»   » రాజమౌళి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా...

రాజమౌళి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఫుల్ లెగ్త్ గ్రాఫిక్ మూవీ 'ఈగ" అనే యానిమేషన్ సినిమా చేయాలనుకుంటున్నాడు రాజమౌళి. దానికి సంబందించిన స్ర్కిప్ట్ ను సిద్దం చేసుకొన్నాడని సమాచారం. అయితే దీనికయ్యే ఖర్చు భారీగానే ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బేనర్ నిర్మిస్తే బాగుంటుందన్నది రాజమౌళి ఫీలింగ్ అట. ప్రముఖ హాలీవుడ్ సంస్థ వాల్ట్ డిస్నీ అయితే బాగుంటుందని రాజమౌళి అనుకుంటున్నాడు. అదే గనుక జరిగితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రాఫిక్స్ గా రాజమౌళి చిత్రమే నిలుస్తుంది.

ఆల్రెడి రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ రావు దర్శకత్వంలో సిద్దార్థ, శృతిహాసన్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రాన్ని వాల్ట్ డిస్నీ నిర్మిస్తోంది. ఆ రకంగా ఈ హాలీవుడ్ సంస్థ టాలీవుడ్ లోకి ఎంటరయ్యింది. ప్రస్తుతం తన లక్ష్యం ఈ సంస్థని సెట్ చేయడానికి రాజమౌళి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X