»   » ఆయనకు ఇంత క్రేజ్ ఉందని ఊహించలేదు: రాజమౌళి

ఆయనకు ఇంత క్రేజ్ ఉందని ఊహించలేదు: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

విడుదలైన మొదటి రోజే సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుని సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతున్న సునీల్‌, రాజమౌళిల 'మర్యాద రామన్న" చిత్రానికి కలెక్షన్స్‌ తగ్గుతున్నాయనుకున్నారో ఏమో ఈ మధ్య యూనిట్‌ మర్యాద పూర్వక యాత్ర పేరుతో రాష్ట్రంలోని కొన్ని సెంటర్స్‌ కి టూర్‌ వేశారు. ఈ నెల 6, 7వ తేదీల్లో ఈ యూనిట్‌ నైజాం ప్రాంతంలో పర్యటించనుంది. ఈ విశేషాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజమౌళి మాట్లాడుతూ...సునిల్‌ లాంటి చిన్న హీరోతో తీసిన సినిమాని ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది.

'మర్యాద రామన్న"కు పనిచేసిన ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని ప్రేక్షకులతో పంచుకోవడానికే టూర్‌ కి వెళ్లాం. ఈ టూర్‌ లో భాగంగా చాలా ప్రాంతాలకు వెళ్లాం. సునీల్‌ కనిపించగానే ప్రేక్షకులు చప్పట్లు కొట్టి, ఈలలు వేసి గోల చేశారు. తనతో 'మర్యాద రామన్న" సినిమాకి కనీసం సంవత్సరం కలిసి పని చేశాను. కానీ సునీల్‌ కి ప్రేక్షకులలో ఇంత క్రేజ్‌ ఉందని ఊహించలేదు. అందుకే 'సారీ సునీల్‌...మీతో సంవత్సరం సినిమా తీశాను" అంటు చిరునవ్వుతో అన్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu