»   » చంపేస్తోంది.... అంటూ త్రిష గురించి రాజమౌళి!

చంపేస్తోంది.... అంటూ త్రిష గురించి రాజమౌళి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రిష ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాయగి'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో త్రిష సాంప్రదాయ పద్దతిలో చీర కట్టుకుని అందమైన స్మైల్ విసురుతూ...చేతిలో కత్తిపట్టుకున్న ఫోటో ఆకట్టుకుంటోంది. దీనిపై రాజమౌళి తన సోల్ నెట్వర్కింగ్ పేజీలో స్పందిస్తూ... త్రిష గెటప్... స్మైల్, ఆమె చేతిలో కత్తి జస్ట్ కిల్లింగ్ అంటూ ప్రశంసలు గుప్పించారు.

And Naayagi.. the contrast of Trisha’s smile and the knife in her hand and combined with the getup, is just killing it...

Posted by SS Rajamouli on Thursday, August 20, 2015

‘నాయగి' చిత్రం హర్రర్‌ నేపథ్యంతో తెరకెక్కుతోంది ఈ చిత్రం షూటింగ్‌ గురువారం చెన్నైలో ప్రారంభం కాబోతుంది. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్టుతో తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి ‘నాయగి' తెరకెక్కనుంది. ఇందులో ‘నాయగి'గా త్రిష ప్రేక్షకులను భయపెట్టబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. త్రిష మేనేజర్‌ గిరి...గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గణేష్‌ వెంకట్రామన్‌ హీరో. ‘అభియుం నానుమ్‌' తరువాత త్రిష, గణేష్‌ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.

Rajamouli FB post about Trisha's Nayagi

తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాతో గోవి దర్శకుడిగా పరిచయం కానున్నాడు. గణేష్ వెంకట్‌రామ్, సత్యం రాజేష్, జయప్రకాష్, బ్రహ్మానందం, మనోబాల, కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తెలుగులో ‘నాయకి' పేరుతో ఈ సినిమా వారం రోజుల తర్వాత ప్రారంభంకానుంది. హార్రర్ కామెడీకి తెలుగు, తమిళంలో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా ఆ కోవలో ఓ మంచి సినిమాగా నిలుస్తుందన్న నమ్మకం వ్యక్తంచేసింది త్రిష.

English summary
"Naayagi.. the contrast of Trisha’s smile and the knife in her hand and combined with the getup, is just killing it" Rajamouli said.
Please Wait while comments are loading...