»   » రాజమౌళి గారు పేరే నా కొడుక్కి...ఆయనే నాకు లైఫ్ ఇచ్చారు

రాజమౌళి గారు పేరే నా కొడుక్కి...ఆయనే నాకు లైఫ్ ఇచ్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా బాహుబలి చిత్రం వరస పోస్టర్ లలో విడుదల చేసిన కాళకేయ పోస్టర్ అందరినీ షాక్ చేసింది. అందులో ప్రభాకర్ గెటప్, లుక్ మర్చిపోలేని విధంగా డిజైన్ చేసారు. మర్యాదరామన్న లో నటించిన ప్రభాకర్ అంటే ఎవరూ గుర్తుపట్టేలేని విధంగా ఈ పోస్టర్ ఉంది. ఆయన తనకు బాహుబలిలో పాత్ర ఎలా వచ్చిందో గుర్తు చేసుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


సిగ్గుపడే తత్వం ఉన్న వ్యక్తిగా ప్రభాకర్ ఎప్పుడూ సినిమాలపై ఆసక్తి చూపించలేదు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండగల్ జిల్లాకు చెందిన ఆయన మాట్లాడుతూ.... " నాకు క్రికెట్ అంటే పిచ్చి నా చిన్నతనం నుంచీ. ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని తప్ప నటుడుని అవుతాను అనుకోలేదు " అన్నారు.


ఇంటర్ మీడియట్ అయ్యిన తర్వాత ఆయన హైదరాబాద్ వచ్చారు ఓ పెళ్లికి. అక్కడ ఆయన బంధువు ఒకరు అతని ఫిజిక్ చూసి..రైల్వే లో జాబ్ ఇప్పిస్తానని ప్రామిస్ చేసారు. ఆ క్రమంలో నేను ఆరేళ్లు ఇక్కడ వెయిట్ చేసాను..కానీ ఫలితం లేదు అన్నారు.


Rajamouli gave me a new life: Prabhakar

జాబ్ లు కోసం సిటీలో స్ట్రగుల్ పడుతూ వెతుకూతూంటే...మగధీర కోసం రాజమౌళి ..జనాన్ని వెతుకుతున్నారని తెలిసింది. నా స్నేహితుల్లో ఒకరు నన్ను అక్కడ సెలక్షన్ కు తీసుకు వెళ్ళారు. రాజమౌళి గారు నన్ను చూసారు కానీ ఏమీ చెప్పలేదు అన్నారు. ఆయన తన మొదటి మీటింగ్ గుర్తు చేసుకుంటూ.


తర్వాత రాజమౌళి అతన్ని రాజస్ధాన్ తీసుకువెళ్లి...అక్కడ ప్రభాకర్ ని కొంతకాలం అబ్జర్వ్ చేసారు. హైదరాబాద్ తిరిగి వచ్చాక...నేను జాబ్ లు తిరిగి వెతుక్కూంటే...నాకు రాజమౌళి గారు నుంచి పిలుపు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఓ రోజు రాజమౌళి గారు అసెస్టెంట్స్ నన్ను తీసుకుని ఆయనకు ఇంటికి వెళ్లారు. అక్కడ మర్యాద రామన్నలో పాత్ర గురించి చెప్పారు.


అప్పుడు నాకు నటన ఏమీ రాదు. అప్పుడు ఆయన దేవదాసుకనకాల వద్దకు పంపారు నటన ట్రైనింగ్ కోసం. అంతేకాదు నాకు పదివేలు స్టైపెండ్ కూడా ఇచ్చారు. నాకు రెమ్యునేషన్ విడిగా ఇచ్చారు ఆ సినిమాకు. దాంతో నా అప్పులన్ని తీరిపోయాయి.


రాజమౌళి గారు ఆ రోజు నాకు కొత్త జీవితం ఇచ్చారు. అలా ఇక్కడ ఈ రోజు మీ ఎదురుగా ఉన్నాను అన్నారు ప్రబాకర్. ఆయన కుమారుడు కు సైతం రాజమౌళి పేరే పెట్టుకున్నారు. మర్యాద రామన్న తర్వాత...ప్రభాకర్...వెనక్కి తిరిగి చూసుకోలేదు. సీమ టపాకాయి, దూకుడు, కృష్ణం వందే జగద్గురుమ్, రీసెంట్ గా దొంగాట ఇలా చేసుకుంటూ పోతున్నారు.


బాహుబలిలో అవకాసం గురించి చెప్తూ..నేను అత్తారింటికి దారేది చిత్రం కోసం పొల్లాచిలో షూటింగ్ లో ఉండగా..రాజమౌళి గారు నుంచి పిలుపు వచ్చింది. బాహుబలి లో పాత్ర గురించి చెప్పారు అన్నారు.

English summary
“Rajamouli sir gave me a new life and today, I am here because of him,”says Prabhakar, who has even named his son after the director. “When I was in Polachi, shooting Atharintiki Daredi, I got a call from Rajamouli sir that I would be playing a character in Baahubali," adds Prabhakar.
Please Wait while comments are loading...