»   » టైటిల్ విషయంలో ఉపేంద్ర ని రాజమౌళి అనుసరిస్తున్నారా?

టైటిల్ విషయంలో ఉపేంద్ర ని రాజమౌళి అనుసరిస్తున్నారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి తన తాజా చిత్రం ఈగ కు టైటిల్ విషయంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అనుసరిస్తున్న దారిలోనే నడిచే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా నయనతార హీరోయిన్ గా ఉపేంద్ర కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన చిత్రం ఒకటి విడుదలకు రెడీగా ఉంది. ఆ చిత్రం టైటిల్ బాగుంది..సూపర్ అన్నట్లు చేతి గుర్తు సింబల్ ఉంటుంది. అంతేతప్ప వేరే టైటిల్ ఏదీ ఉండదు. ఇదే ప్రేరణతో ఈగ చిత్రానికి కూడా రాజమౌళి అలాగే వెళ్ళాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం పేరు ఈగ అని రాసే బదులు ఈగ బొమ్మ వేస్తే ఎలా ఉంటుందని తన సన్నిహితులుతో ఆలిచిస్తున్నట్లు తెలిస్తోంది.

"విలన్ చేతిలో చనిపోయిన హీరో మరుజన్మలో ఈగగా పుట్టి, విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ఇతివృత్తం. ఇందులో ఈగకి ఎలాంటి అదనపు శక్తులూ ఉండవు. మూమూలు ఈగగానే ఉంటుంది కానీ గతజన్మ జ్ఞాపకాలుంటాయి. చాలా చాలా ప్రయోగాత్మక చిత్రం. రెండు గంటల్లోపల నిడివి ఉండే ఈ చిత్రంలో మూడు పాటలుంటాయి. తెలుగు, తమిళ భాషల్లో తీయటం కూడా మార్కెట్ పరంగా లాభసాటి వ్యాపారమేనంటున్నారు. చిన్న సైజులో కనిపించే ఈగనీ, పెద్దగా కనిపించే మనుషుల్నీ అనుసంధానం చేయడానికి చాలా కష్టమని, అత్యున్నత నైపుణ్యంతో కూడిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో నాని, సమంత హీరో, హీరోయిన్స్ గా చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu