»   » వీడియో :రాజమౌళి మెచ్చుకున్న దేవకట్టా షార్ట్ ఫిల్మ్

వీడియో :రాజమౌళి మెచ్చుకున్న దేవకట్టా షార్ట్ ఫిల్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రాజమౌళి మొదటి నుంచి ఎక్కడ తనకు నచ్చిన అంశమున్నా వెంటనే దాన్ని మెచ్చుకుని ఆ ప్రతిభను ప్రశంసల్లో ముంచెత్తుతారు. తాజాగా ఆయన దర్శకుడు దేవకట్టా డైరక్ట్ చేసిన ఓ షార్ట్ ఫిల్మ్ ని చూసి మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు. ఆ షార్ట్ ఫిల్మ్ ని, ఆయన ట్వీట్ ని ఇక్కడ చూడండి.

దేవకట్టా...స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ రెండు నిముషాల షార్ట్ ఫిల్మ్ ని రూపొందించారు. ఫిమేల్ ఎకనామిక్స్ ఇండిపెండెన్స్ పాయింట్ ఆధారంగా ఈ షార్ట్ ఫిల్మ్ ని ఆయన తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్ లో పాప్ స్టార్ స్మిత, నటుడు రవి వర్మ నటించారు.

ఈ షార్ట్ ఫిల్మ్ ప్రముఖ దర్శకుడు రాజమోళి ని షాక్ కు గురి చేసింది. ఆయన ఈ షార్ట్ ఫిల్మ్ ని చూసి...మెచ్చుకున్నారు. గుండెలు పిండేసే లెక్కలు అని ఆయన ఆయన అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

‘బాహుబలి' సినిమా టైటిల్స్ లో దర్శకుడు దేవా కట్టకు థాంక్స్ చెబుతూ కూడా ఓ టైటిల్ వేయించాడు దర్శకుడు రాజమౌళి. దానికి కాణం ఈ సినిమా కోసం దేవా కట్ట కొన్ని డైలాగ్స్ రాసిచ్చారనే సంగతి తెలిసిందే. సినిమా క్లైమాక్స్‌లో ఫ్రభాస్ చెప్పే డైలాగులు ఈయనే రాసారు. ‘బాహుబలి' కోసం దేవా కట్ట కాంట్రిబ్యూషన్ చిన్నదే అయినా రాజమౌళి ఆయన్ను మరిచిపోలేదు. అందుకే ఆయనకు క్రెడిట్ ఇస్తూ థాంక్స్ కార్డు వేయించాడు. దీనిపై దేవా కట్ట సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. ఇంతకీ దేవకట్టా రాసిన డైలాగు ఏమిటీ అంటే...

Rajamouli has appreciated the attempt of Dev Katta.

"నాతో వచ్చేదెవరు...నాతో చచ్చేదెవరు...చావుని దాటుకుని నాతో బ్రతికేదెవరు !"

క్లైమాక్స్ లో తన సైనికులను ఉద్దేసించి ఇన్సిప్రేషన్ గా చెప్పే ఈ అద్బుతమైన డైలాగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రమ్యకృష్ణకు సైతం కొన్ని డైలాగులు ఆయన రాసారు.

దేవకట్టా ట్వీట్ చేస్తూ... ‘బాహుబలిలో వార్ సమయంలో ప్రభాస్ చెప్పే స్పీచులు కేవలం కొన్ని పదాలు మాత్రమే నేను రాసాను. రాజమౌళి సృష్టించిన బాహుబలి సముద్రంలో నేను చేసింది నీటి చుక్కంత మాత్రమే. అంత మాత్రానికే రాజమౌళి నాకు థాంక్స్ కార్డు వేయించాడు. అది రాజమౌళి గొప్పతనం' అంటూ దేవా కట్ట చెప్పుకొచ్చారు.

English summary
SS Rajamouli who is known for expressing his like towards short films has appreciated the attempt of Dev Katta. Rajamouli tweets'' Shocking and heart wrenching statistics. Aptly put out on the eve of Independence Day by''
Please Wait while comments are loading...