»   » దారుణం..రాజమౌళి రెండు రోజులు లేటు చేస్తే రూమర్స్ లేపేయటమేనా?

దారుణం..రాజమౌళి రెండు రోజులు లేటు చేస్తే రూమర్స్ లేపేయటమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu


హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తున్నారు. తాము అనుకున్నదే కరెక్టు అన్న భావనలో జనం చెలరేగిపోతున్నారు. రకరకాల రూమర్స్ కు తెర తీస్తున్నారు. తాజాగా రాజమౌళికు రానాకు చెడింది...అందుకే ఘాజీ చిత్రం గురించి ఇంకా రాజమౌళి రివ్యూలాంటి తన స్పందన తెలపలేదు అంటూ ఫేస్ బుక్ లో కొన్ని రూమర్స్ మొదలయ్యాయి.

ఈ మధ్య కాలంలో రాజమౌళి తన సినిమాలే కాక వేరే దర్శకులు తెరకెక్కించిన పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను చూస్తూ వాటి రివ్యూస్ ని తన పేజ్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 17న విడుదలైన ఘాజీ చిత్రంపై రాజమౌళి స్పందించకపోవడం ఇలా రూమర్స్ క్రియేట్ చేసేలా చేసింది.

ముఖ్యంగా తను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి లో కీలక పాత్రధారి అయిన రానా దగ్గుబాటి హీరోగా నటించిన 'ఘాజీ' సినిమాను రాజమౌళి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోవడం.. దాని గురించి మాట్లాడకపోవడం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. వీటన్నింటికి పులిస్టాప్ పెట్టే విధంగా రాజమౌళి తన అఫీషియల్ పేజ్ లో ఓ పోస్ట్ పెట్టాడు.

Rajamouli heaps praise on 'Ghazi'

దగ్గుబాటి రానాకు దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి శుభాకాంక్షలు తెలిపారు. రానా హీరోగా ఇటీవల విడుదలైన 'ఘాజీ' చిత్రాన్ని ఉద్దేశించి రాజమౌళి ట్వీట్‌ చేశారు. 'కెప్టెన్‌, అతడి బృందం ప్రేరేపితంగా షోను ప్రదర్శించారు. తెర ముందు, తెర వెనుక కూడా. 'ఘాజీ' టీమ్‌ చక్కగా చేసింది. శుభాకాంక్షలు రానా' అని జక్కన్న ట్వీట్‌ చేశారు.


ఘాజీ చిత్ర దర్శకుడు మరియు టీం చేసిన కృషి గొప్పదని, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లో ఘాజీ టీం ఎక్స్ లెంట్ అంటూ రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. ఇక రానాకు ప్రతేక విషెస్ తెలియజేశాడు.


1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21, పాకిస్థానీ జలంతర్గామి ఘాజీ మధ్య జరిగే నీటి యుద్ధం కథ ఆధారంగా సంకల్ప్‌ తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కె.కె. మీనన్‌, అతుల్‌ కులకర్ణి, తాప్సి, ఓంపురి, నాజర్‌ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. పీవీపీ సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చిత్రాన్ని నిర్మించారు.

English summary
Rana Daggubati-starrer "Ghazi", based on the mysterious sinking of PNS Ghazi, a Pakistan-deployed submarine during India-Pakistan 1971 war, has won over filmmaker S.S. Rajamouli. He feels the underwater war drama has excelled.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu