twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటమి ఎరుగని దర్శకధీర ‘రాజమౌళి’ని ఈగ ఏంచేస్తుందో...!?

    By Sindhu
    |

    తెలుగు సినిమా దర్శకుల్లో రాజమౌళికి ఓ సపరేట్ బ్రాండ్ ఉంది. రాజమౌళి తొలి సినిమా నుంచి మొదలు కొని మర్యాద రామన్న వరకు ఫెయిల్యూర్ లేని దర్శకుడు. మగధీర సమయంలో అల్లు అరవింద్ కు, రాజమౌళికి వచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాల వాళ్ళ 'మగదీర'ను కొట్టాలనే ఉద్దేశం తోనే 'బద్రినాథ్' ను తీశారు కాని బద్రినాథ్ తో వినాయక ఓడిపోయారు. దీంతో రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ గా వెలిగి పోతున్నాడు. పరిశ్రమ లో ఉన్న దర్శకులందరికీ ఫెయిల్స్ ఉన్నాయి. కాని ఫెయిల్యూర్ లేనిది ఒకే ఒక్క రాజమౌలికే . బద్రినాథ్ విడుదల తో రాజమౌళి
    స్టామిన ఏమిటో తెలుగు సినిమా పరిశ్రమకు మరో సారి తెలిసి వచ్చింది.

    అయితే కమర్షియల్ సినిమాల దర్శకుడిగా పేరు ఉన్న రాజమౌళి 'ఈగ" పేరుతో సోసియో ఫాంటసి చిత్రం తో ప్రయోగం చేస్తున్నాడు. ఒక ఈగ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా తెరకెక్కుతుండటం విశేషం. విలన్ చేతిలో హత్యకు గురైన హీరో మళ్ళి జన్మలో 'ఈగ'గా పుట్టి తన చావుకు కారణమైన ప్రతినాయకుడిఫై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్నది ఈ సినిమా కధ. నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు సుదీప్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. మరి ఈగ ఎం చేస్తుందో వేచి చూడాల్సిందే.

    English summary
    SS Rajamouli sets a new example for the directors of Tollywood. As a man of elan he has proven a lot with his outstanding commercial films those know no failure till now. Rajamouli became a synonym for everlasting successes and his recent flick ‘Magadheera’ stood on the zenith of entire Tollywood history.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X