»   » రాజమౌళి జేమ్స్ బాండ్ మహేష్ బాబునే...!?

రాజమౌళి జేమ్స్ బాండ్ మహేష్ బాబునే...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబుని జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలని వుందంటూ, చాన్నాళ్ళుగా అలాంటి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తోన్న మహేష్ సోదరి మంజుల, అప్పట్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆ సినిమా చేయాలని అనుకున్న సంగతి విదితమే. అయితే ఈ తర్వాత సురేందర్ రెడ్డి హవా తగ్గడం, ప్రస్తుతం రాజమౌళి ఫీవర్ టాలీవుడ్ హీరోలను వెంటాడుతుండడంతో, మంజుల, రాజమౌళిని కలిసి, జేమ్స్ బాండ్ సినిమా ప్రస్తావన తీసుకొచ్చిందట. అయితే అంతకు ముందే ఏ మాయ చెసావె దర్శకుడు గౌతమ్ మీన్ దర్శకత్వంలో ఇటు తెలుగు, అటు తమిళంలో చిత్రీకరణ జరుగుతుందిన ఈ రెండు వెర్షన్ లలోనూ సమంతా హీరోయిన్ అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే మహేష్ జేమ్స్ బాండ్ ఎవరి సొంతమవుతుందో వేచి చూడాల్సిందే..

ఈ విషయమై రాజమౌళి ఇంకా ఓకే చెయ్యనప్పటికీ, మహేష్ అభిమానులు మాత్రం రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో జేమ్స్ బాండ్ సినిమా అంటూ, గ్రాఫిక్స్ మిక్స్ చేసి ఫోటోలు తయారు చేసేసుకుంటున్నారు. కాగా మహేష్ తో సినిమా చేయాలని తనకూ వుందని అయితే అదెప్పుడు వర్కవుట్ అవుతుందో తనకీ తెలియదని చెబుతోన్న రాజమౌళి, 2011 సెకెండాఫ్ లో ఈ చిత్రానికి శ్రీకారం చుడ్తాడనే ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu