For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'సురాజ్య ఉద్యమం'ప్రారంభిస్తున్న ఎస్.ఎస్.రాజమౌళి

  By Srikanya
  |

  హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ రోజు'సురాజ్య ఉద్యమం' ప్రారంభించనున్నారు. ప్రభుత్వ పాలనలో తమ హక్కులపై ప్రజల్లో చైతన్యం తేవటం లక్ష్యంగా లోకసత్తా పార్టీ చేపడుతున్న 'సురాజ్య ఉద్యమం' గురువారం నుంచీ ప్రారంభం కానుది. ఈ ఏడాది డిసెంబర్ 9 వరకూ నిర్వహించనున్న ఈ ఉద్యమాన్ని గురువారం సాయింత్రం ఐదు గంటలకు లోకసత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ,ఎస్.ఎస్ రాజమౌళి ప్రారంబించనున్నారు. హైదరాబాద్ బాగ్ లింగం పల్లి సుందరయ్య విజ్ఠాన కేంద్రం లో ఈ కార్యక్రమం జరుగుతుంది. సమాజంలో మంచి మార్పు కోరుకునే ప్రతీ ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

  ఇక గతంలోనూ రాజమౌళి లోక్ సత్తాకు సపోర్టు చేస్తూ ప్రచారం సైతం చేసారు. నైతికవిలువలు ఉన్న పార్టీ అంటూ లోక్ సత్తా జెండ్ భుజాన ఎత్తుకున్నారు. హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ లో లోక్ సత్తా పార్టి ప్రచారం నిమిత్తం ఆయన పర్యటించారు. అవినీతిరహిత పాలన రావాలంటే లోకసత్తా వల్లే సాధ్యమవుతుందంటూ పిలుపునిచ్చారు. అయితే జనం నుంచి ఊహించిన విధంగా స్పందన రాకపోవటం కొంత నిరాశపరిచింది. మరో ప్రక్క ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి భవిష్యత్ లో వస్తానని చెప్పటం ఈ రోడ్ షో ఆ మాటలకు ఊతమిచ్చింది. సంగీత దర్సకుడు కీరవాణి, ఆయన భార్య కూడా లోక్ సత్తా పార్టీ తరుపున ప్రచారంలో తిరుగుతున్న సంగతి తెలిసిందే.

  ఇంక రాజమౌళి తాజాగా ఈగ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. లోక్ సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ ఈగ సినిమా చూసి ప్రశంసించారు. జేపీ నుంచి తనకు ఊహించని కాల్ వచ్చిందని రాజమౌళి ట్వీట్ చేశారు. నాకాయన ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారంటూ రాజమౌళి ఉద్వేగంగా చెప్పాడు. తన తదుపరి చిత్రం ప్రభాస్ తో చేయటానికి సిద్దపడుతున్నారు. ఈ మేరకు స్క్రిప్టు వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఈ సినిమా ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ పంజా చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ ప్రభాస్-రాజమౌళిల చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారని సమాచారం. గతంలో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ ల వచ్చిన ఛత్రపతి భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

  రాజమౌళి దర్సకత్వంలో రూపొందబోయే చిత్రం కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బిళ్లా సమయంలో తన బాడీ షేప్ పై దృష్టి పెట్టిన ప్రభాస్ మరోసారి తన బాడీ పవర్ చూపించాలని ప్రిపేర్ అవుతున్నాడు. ఆ విషయమై ప్రభాస్ కి రాజమౌళి స్ట్రిక్ట్ గా చెప్పినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రభాస్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ప్లాన్ జరిగిపోయినట్టు తెలుస్తుంది. ఈగ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెట్టినందుకు గానూ తరువాత సినిమాను వీలయినంత తక్కువ టైంలో ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని చెప్తున్నారు.

  English summary
  Dr.Jayprakash Narayan and Director Raja Mouli joined hands to starat Swrajya udyamam here in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X