twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ-క్రిష్ బ్యాడ్ కాంబినేషన్, ప్లాప్ అనుకున్నా : ఓపెన్‌గా చెప్పిన రాజమౌళి!

    నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన చారిత్రక కథాంశం.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు జాతి చరిత్రకు సంబంధించిన చారిత్రక కథాంశంతో తెరకెక్కిన ఈచిత్రానికి అన్ని వర్గాల నుండి ఆదరణ లభిస్తోంది.

    సినిమా ప్రమోషన్లో భాగంగా దర్శకుడు రాజమౌళి స్వయంగా క్రిష్‌ను ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంగా రాజమౌళి చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్య పరిచాయి. బాలయ్య-క్రిష్ కాంబినేషన్ అనే విషయం తెలియగానే బ్యాడ్ కాంబినేషన్ అని ఫీలయ్యాను. ఈ సినిమాను ప్రారంభించిన తర్వాత.. ఫ్లాప్ గ్యారెంటీ అనుకున్న అనేకమందిలో తాను కూడా ఒకడినని రాజమౌళి చెప్పుకొచ్చారు.

    నిజాయితీగా ఒప్పుకున్న రాజమౌళి

    నిజాయితీగా ఒప్పుకున్న రాజమౌళి

    టాలీవడ్ టాప్ డైరెక్టర్ గా, బాహుబలి లాంటి భారీ చిత్రాలను తీయగల సత్తా ఉన్న గ్రేట్ డైరెక్టర్ గుర్తింపు ఉన్న రాజమౌళి.... తన మనసులో అనుకున్న మాటను ఇలా నిజాయితీగా బయట పెట్టడం అందరినీ ఆశ్యర్చ పరిచింది. అంతే కాదు... ప్లాప్ అని భావించిన మా లాంటి వారి అభిప్రాయాలు తప్పని నిరూపించేలా సినిమాను హిట్ చేసినందుకు థాంక్స్ అంటూ ఈ సందర్భంగా రాజమౌళి దర్శకుడు క్రిష్ ను అభినందించారు.

    అలా అనుకోవడానికి కారణం

    అలా అనుకోవడానికి కారణం

    రాజమౌళి ముందు అలా భావించడానికి కారణం...బాలయ్య మాస్ ఇమేజ్ ఉన్న హీరో కావడమే. బాలయ్య ఇప్పటి వరకు చేసిన సినిమాలకు..... క్రిష్ ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పొంతన లేక పోవడమే. అలాంటి వీరి కాంబినేషన్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా అనగానే రాజమౌళికి హిట్టవుతుందనే నమ్మకం కలగలేదు.

    తర్వాత ఆలోచన మారింది

    తర్వాత ఆలోచన మారింది

    క్రిష్ కథ చెప్పాక నా ఆలోచనలో మార్పు వచ్చింది. బాలయ్యకు సూటయ్యే ఎమెషన్స్ సినిమాలో ఉండటం, తల్లి, భార్య సెంటిమెంట్ బాగుండటంతో హిట్ అయిపోద్దనే నమ్మకం క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చిందని రాజమౌళి తెలిపారు.

    రాజమౌళి మైండ్ బ్లాంక్

    రాజమౌళి మైండ్ బ్లాంక్

    అలా క్రమ క్రమంగా శాతకర్ణి సినిమాపై పాజిటివ్ ఓపీనియన్ మొదలైంది. అయితే ట్రైలర్ చూసి తర్వాత మైండ్‌బ్లాంక్ అయిపోయింది. ఒకప్పుడు ఈ సినిమా ప్లాప్ అనుకున్న నేను, నాలాంటి వారు చాలా మంది ట్రైలర్ చూసి సినిమా గ్యారంటీ హిట్ అని ఫిలయ్యారు. రిలీజ్ అయ్యాక బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

    79 రోజుల్లో షూటింగ్ ఎలా పూర్తి చేసారనే రాజమౌళి ప్రశ్నకు క్రిష్ ఇలా

    79 రోజుల్లో షూటింగ్ ఎలా పూర్తి చేసారనే రాజమౌళి ప్రశ్నకు క్రిష్ ఇలా

    79 రోజుల్లో షూటింగ్ ఎలా కంప్లీట్ చేసారు? అని రాజమౌళి ప్రశ్నించగా.... క్రిష్ వెంటనే అందుకుని... ముందు మీరు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటూ సరదాగా అడిగారు. తర్వాత తన 79 రోజుల షూటింగ్ గురించి చెప్పారు. పక్కా ప్లానింగుతో వెళ్లడం వల్లే సాధ్యమైందన్నారు. ఉదయం 6 గంటలకే పని మొదలయ్యేది. ఒక్కోసారి రాత్రి 11 వరకు పని చేసాం. షూటింగ్ తర్వగా పూర్తి కావాలంటే గ్రాఫిక్స్ వర్క్ తగ్గించుకోవాలని మీరు ఇచ్చిన సలహా పాటించాను.

    ప్రాజెక్టు నాలుగు భాగాలుగా షూటింగ్

    ప్రాజెక్టు నాలుగు భాగాలుగా షూటింగ్

    ప్రాజెక్టును మొత్తం 4 భాగాలుగా విభజించాం. నహాపనుడితో యుద్ధం మోరాకోలో షూట్ చేసాం. హైదరాబాద్ లో వేసిన సెట్లో నావల్ వార్ షూట్ చేసాం. పోర్టు యుద్ధం జార్జియాలో తీసాం. మిగతా భాగాలు హైదరాబాద్ రామోజీఫిల్మ్ సిటీ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లలో చిత్రీకరించామని క్రిష్ తెలిపారు.

    English summary
    Rajamouli has admitted that he had first thought combination of Balakrishna and Krish was "bad". However, Rajamouli is humble enough to admit his mistake and credited Krish for proving him wrong.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X