»   » 'ఆర్య 2'ని కూడా కాపీ చేసాను...ఎస్.ఎస్.రాజమౌళి

'ఆర్య 2'ని కూడా కాపీ చేసాను...ఎస్.ఎస్.రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆ సీన్ 'ఆర్య 2'కి కాపీ అని బాగా గమనిస్తేగానీ తెలీదు....అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. ఆయన రీసెంట్ గా నిర్మించిన 'మర్యాద రామన్న' కోసం 'ఆర్య-2'లోని ఓ సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని మర్యాదరామన్న లో పెట్టారు. అదే విషయం చెబుతూ 'ఎందుకిలా నా ఖర్మ కాలిపోయింది....అన్నచోట బీట్‌ మొదలై వెనుక స్లో మోషన్ ‌లో కార్ల బ్లాస్టింగ్‌ కనిపిస్తుంది. అది సుకుమార్‌ ఇచ్చిన స్ఫూర్తే. అది 'ఆర్య 2'కి కాపీ అని బాగా గమనిస్తేగానీ తెలీదు అన్నారు. అలాగే తనకు సుకుమార్ శైలి అంటే ఇష్టమని చెప్తూ...

'నాకు సుకుమార్‌ స్క్రీన్‌ ప్లే అంటే చాలా ఇష్టం. 'ఆర్య 2' చూసి ఫ్లాటైపోయా. అందులో కారు ఫైటు ఒకటి ఉంటుంది. గీతని ఏడిపించారని ఆర్య అందర్నీ చితక్కొట్టేస్తుంటాడు. చివర్లో ఒక రౌడీ దగ్గర గీత ఫొటో చూసి ఆగిపొతాడు. అక్కడ స్లో మోషన్‌లో ఆకులు రాలడం...రౌడీలు పడిపోవడం...చూపించారు. బ్యాక్‌ గ్రౌండ్ ‌లో 'గుప్పెడంత ఈ గుండెలో..' బీట్‌ మొదలవుతుంది. ఓ పోరాట దృశ్యాన్ని కూడా లవ్‌ ఫీల్‌ తో నింపేశాడు సుకుమార్‌. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ ఆలోచన నాకెందుకు రాలేదు? అనిపించింది..అందకే 'మర్యాద రామన్న' కోసం 'ఆర్య-2'లోని ఆ సన్నివేశాన్ని స్ఫూర్తిగా తీసుకొన్నాను...అని చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu