»   » అల్లుతో విభేదాలా? రాజమౌళి మనస్ధాపానికి కారణం?

అల్లుతో విభేదాలా? రాజమౌళి మనస్ధాపానికి కారణం?

Subscribe to Filmibeat Telugu

తెలుగుసినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్ళు ( సుమారు 120 కోట్లు)పొందిన "మగధీర" సినిమాను మలిచిన ప్రతిభాశాలి రాజమౌళి ఇప్పుడు బాధపడుతున్నారా? ఆ సినిమా మెగా హిట్ అయిన ఆనందం ఆయనలో ఎక్కువకాలం నిలువలేదు. షూటింగ్ సమయంలోనే అల్లు అరవింద్ తో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. సినిమా విడుదల సమయంలో కథకు సంబంధించిన వివాదం వచ్చింది. ఎస్పీ చారి ఆ కథను తన నవల నుంచి దొంగిలించారని అన్ని టీవీ చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చెప్పారు. కథ కోసమే తన తండ్రి విజయేంద్రప్రసాద్ కు దాదాపు కోటి రూపాయలు అల్లు అరవింద్ ద్వారా ఇప్పించినట్టు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వదంతి ప్రచారంలో ఉంది. కథ విషయంలో వివాదాన్ని పక్కన పెడితే, దర్శకుడిగా రాజమౌళి ప్రతిభను ఎవరూ కాదనలేరు. చిన్న వయసులోనే అంత పరిపక్వతను ఆయన సాధించడం గొప్ప విషయమే. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన పెద్ద వరం అనడంలో సందేహం లేదు.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ "అదుర్స్" ఫంక్షన్ లో రాజమౌళి అదుర్స్ ను విపరీతంగా పొగిడారు. తన మగధీర కలెక్షన్లను అదుర్స్ అధిగమించాలని ఆకాంక్షించారు. దానిని ఆకాంక్ష అనడం కంటే అల్లు మీద కక్ష అనడం సముచితంగా ఉంటుందేమో. ఏది ఏమైనా అల్లు అరవింద్- రాజమౌళి కుటుంబం మధ్య రగిలిన కక్షల వల్ల మరో పదేళ్ల వరకు గీతా ఆర్ట్స్ తో రాజమౌళి సినిమా వచ్చే అవకాశాలు కన్పించడం లేదు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu