»   » ‘అ!... ఈ తిక్క సినిమాలో నా సంపాదన మొత్తం పెట్టానన్న నాని, రాజమౌళి ఆశ్చర్యం!

‘అ!... ఈ తిక్క సినిమాలో నా సంపాదన మొత్తం పెట్టానన్న నాని, రాజమౌళి ఆశ్చర్యం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Awe Theatrical Trailer 'అ!' చిత్రం ట్రైల‌ర్

నేచ‌ర‌ల్ స్టార్ నాని నిర్మాత సమర్పణలో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం అ!. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా కసండ్ర‌, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, నిత్యామీన‌న్‌, ముర‌ళీశ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రులు న‌టించారు. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మాత‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 16న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ట్రైలర్ బాగా నచ్చేసింది: రాజమౌళి

ట్రైలర్ బాగా నచ్చేసింది: రాజమౌళి

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... ‘ ఈ సినిమాలో నటించిన వాళ్లంతా నాకు ఇష్టమైనోళ్లే. ఎవరితో మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. రాగానే నాతో ట్రైలర్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూడగానే మనకు సినిమా చూడాలనిపించాలి. ఈ ట్రైలర్ చూసిన వెంటనే నాకు అదే ఫీలింగ్ కలిగింది. వీలైతే ఒక రోజు ముందే సినిమా వేయించుకుని చూడాలనుకుంటున్నాను. ప్రశాంత్ చాలా బాగా చేశారు' అని రాజమౌళి ప్రశంసించారు.

కొత్తగా చేయమంటే చేపగా మారాడు అంటూ రాజమౌళి ఆశ్చర్యం

కొత్తగా చేయమంటే చేపగా మారాడు అంటూ రాజమౌళి ఆశ్చర్యం

నాని ఈ మధ్య వరుసగా హిట్లు కొడుతున్నాడు. ఏం హిట్లు కొడుతున్నాడో కూడా గుర్తు లేదు, తనకు కూడా ఇది గుర్తుందో? లేదో? తెలియదు. ఓ హిట్ తర్వాత నానికి ఒక మెసేజ్ పెట్టాను. వరుసగా హిట్ కొడుతున్నావు, పెంటాస్టిక్... అందరికీ కావాల్సింది అదే. కానీ నువ్వు దీన్ని దాటి ఒక స్టెప్ పైకి వెళ్లాలి, దాని కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. దానికి నాని రిప్లై ఇస్తూ.... తప్పకుండా ట్రై చేస్తాను సార్ అని చెప్పాడు. కట్ చేస్తే నాని ఇపుడు చేపలా కనిపించాడు. ఏదైనా కొత్తగా చేయాలంటే ఇలా చేపగా మారిపోయాడు. నాని సినిమా అంటే హిట్ గ్యారంటీ అని అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. దానికంటే ముందుకు వెళ్లాలని అంతా కోరుకుంటున్నాం.... అని రాజమౌళి అన్నారు.

 రెజీనా గురించి రాజమౌళి

రెజీనా గురించి రాజమౌళి

రెజీనా లుక్ చూడ‌గానే అందులో అందం, ఆక‌ర్ష‌ణ, బోల్డ్‌నెస్ ఆక‌ట్టుకుంది. ఈ అమ్మాయి ఈ ఒక్క సినిమానే చేస్తుందా, ఇలా తయారైతే మ‌రో సినిమా చేయ‌లేదు కదా.... అని కూడా అనిపించింది. ఈ సినిమాలో న‌టించిన అంద‌రినీ చూస్తుంటే, చాలా ఆస‌క్తిగా అనిపిస్తుంది. ఈ సినిమా ట్రెండ్ సెట్ట‌ర్ అవుతుంద‌ని భావిస్తున్నాను అని రాజమౌళి తెలిపారు.

 ఇదో తిక్క సినిమా: నాని

ఇదో తిక్క సినిమా: నాని

నాని మాట్లాడుతూ `` ఈ సినిమా గురించి ప్రాపర్ గా చెప్పాలంటే ఇదొక తిక్క సినిమా. మ‌న అందరిలో కాస్త తిక్క ఉంటుంది. ఆ తిక్క‌ను శాటిస్ఫై చేసే సినిమా ఇది.... అని నాని చెప్పుకొచ్చాడు.

ప్రొడక్షన్ ఎందుకు అన్నారు కొందరు

ప్రొడక్షన్ ఎందుకు అన్నారు కొందరు

‘‘హీరోగా వరుస సినిమా చేస్తున్నాడు క‌దా, ఇపుడు ప్రొడక్షన్ అవసరమా? అని చాలా మంది ఉన్నారు. బయటి నుండి చూసే వారికి ప్రొడ్యూస్ చేయ‌డం లాభ‌సాటి వ్యాపారం అనుకుంటారు. కానీ అదేమీ కాదు. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయడం అంత ఈజీకాదు. ఈ సినిమా తీసిన తర్వాత నిర్మాత‌ల‌పై గౌర‌వం పెరిగింది. నిర్మాత‌లంద‌రికీ హ్యాట్సాఫ్‌. '' అని నాని తెలిపారు.

ఏ నిర్మాతకు చెప్పే ధైర్యం నేనే చేయ‌లేక‌పోయాను

ఏ నిర్మాతకు చెప్పే ధైర్యం నేనే చేయ‌లేక‌పోయాను

‘ప్ర‌శాంత్ క‌థ చెప్ప‌గానే, నాకు కొత్త‌గా అనిపించింది. త‌న ద‌గ్గ‌ర ప్రొడ్యూస‌ర్స్ లేర‌ని తెలిసింది. ఈ క‌థ‌ను స‌రిగ్గా హ్యాండిల్ చేసే నిర్మాత ఉంటే మీ అందరి దగ్గరికి కథ చేరుతుంది అనిపించింది. ఒక మంచి ప్రొడ్యూస‌ర్‌నిస్తాను. నువ్వు తొంద‌ర‌ప‌డొద్దు అని త‌న‌కి చెప్పాను. ఇద్ద‌రు, ముగ్గురు పేర్లు అనుకున్నా, కాని వారికి ఎలా చెప్పాలి, ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. వారికి చెప్పే ధైర్యం కూడా చేయ‌లేక‌పోయాను. నాకు కూడా కథ న‌చ్చింది కాబ‌ట్టే ప్ర‌శాంత్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను అని చెప్పాను' అని నాని తెలిపారు.

 నేను సంపాదించింది మొత్తం పెట్టడానికి సిద్ధం

నేను సంపాదించింది మొత్తం పెట్టడానికి సిద్ధం

‘‘ఈరోజు వ‌ర‌కు నేను సినిమాలోనే సంపాదించాను. ఈ మొత్తాన్ని సినిమాపై పెట్టడానికి నేను రెడీ. ఇలాంటి ఐడియాను నేను స‌పోర్ట్ చేయ‌క‌పోతే మంచి క‌థ‌లు తెలుగులో రావనిపించి నేనే సినిమాకు నిర్మాత‌గా మారాను. వ‌ర్కింగ్ టైటిల్‌ను `అ!` అని అనుకున్నాడు ప్ర‌శాంత్‌. అది విన‌గానే ఏదైనా మంచి ప‌ని చేయ‌డానికి ముందు.. అక్ష‌రాలు దిద్దించ‌డానికి ముందు అ అక్ష‌రాన్ని ముందుగా రాయిస్తారు. ఇది నీ, నా మొద‌టి సినిమా కాబ‌ట్టి ఇంత కంటే మంచి టైటిల్ ఉండ‌ద‌నిపించి అదే టైటిల్‌ను ఫిక్స్ చేసుకోమ‌ని చెప్పాను.' అని నాని తెలిపారు.

సినిమాలో పాత్రల గురించి

సినిమాలో పాత్రల గురించి

ప్ర‌శాంత్ క‌థ అనుకున్న‌ప్పుడే కాజ‌ల్‌ను అనుకున్నాడు. కాజ‌ల్‌ కథ విని ఈ రోల్‌ను నేనే చేస్తానని చెప్పి న‌టించింది. నిత్యామీన‌న్ పాత్ర చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అలాంటి పాత్ర‌ను ఎవ‌రూ రివీల్ చేయ‌రు. ప్రియ‌ద‌ర్శిలో యూనిక్ స్టైల్ ఉంది. త‌ను చెఫ్ రోల్‌కు స‌రిపోతాడ‌నిపించింది. ఆ పాత్ర‌లో సూట్ అయ్యాడు. అటు త‌మిళ‌, తెలుగు సినిమాలు చేస్తూ ఓ పాత్ర కోసం హెయిర్ స్టైల్‌నే మార్చేసింది రెజీనా. ముందు త‌ను చేయ‌దేమోన‌ని అనుకున్నా.. కానీ తీరా ఆమె లుక్స్‌తో ఉన్న ఫోటోల‌ను పంపితే చూసి నేను షాక‌య్యాను. హీరోయిన్ ఈషా ఇందులో బ్యూటీఫుల్ రోల్ చేసింది. అవ‌స‌రాల శ్రీనివాస్ నేను అనుకున్న రోల్‌కు ప‌ర్‌ఫెక్ట్‌గా సూట‌య్యాడు. కోస్టార్ ముర‌ళీశ‌ర్మ‌గారు కూడా ఇందులో చాలా మంచి పాత్ర చేశాడు..... అని నాని చెప్పుకొచ్చారు.

 రవితేజకు ఇలాంటి సినిమాలు న‌చ్చవేమోన‌ని చాలా మంది అనుకుంటారు

రవితేజకు ఇలాంటి సినిమాలు న‌చ్చవేమోన‌ని చాలా మంది అనుకుంటారు

ఇక ర‌వి అన్న‌(ర‌వితేజ‌), నాకు క‌థ విని వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి ఒప్పుకున్నారు. అయన చేసే సినిమాలు చూసి ఆయ‌న‌కు ఇలాంటి సినిమాలు న‌చ్చవేమోన‌ని చాలా మంది అనుకుంటారు. కానీ నేను ప్రొడ్యూస్ చేస్తున్నాన‌ని తెలియ‌గానే ఆయ‌న నాకు పోన్ చేసి `ఏంట‌బ్బాయ్ మ‌న‌మిద్ద‌రం క‌లిసి ప్రొడ్యూస్ చేసేద్దామా!` అన్నారు. ఇలాంటి కొత్త ఆలోచ‌న‌ల‌ను ఆయ‌నెలా ఎంక‌రేజ్ చేస్తారోన‌ని నాకిప్పుడు అర్థ‌మైంది.... అని నాని తెలిపారు.

ఇలాంటి డైరెక్ట‌ర్‌ని నేను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాన‌ని గర్వంగా ఉంది

ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సినిమా చేసిన విధానం చూస్తే.. ఇది త‌న తొలి సినిమా అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. ఇలాంటి డైరెక్ట‌ర్‌ని నేను ఇంట్ర‌డ్యూస్ చేస్తున్నాన‌ని గర్వంగా ఉంది. సినిమా మొన్న‌నే చూశాను, చాలా గ‌ర్వంగా ఫీల‌య్యాను. కార్తీక్ ప్ర‌తి ఫ్రేమ్‌తో అంద‌రినీ డామినేట్ చేస్తాడు. ఎడిట‌ర్ గౌత‌మ్ స‌హా అంద‌రికీ థాంక్స్‌... అని నాని తెలిపారు.

English summary
Hero Nani Fantastic Speech at Awe Movie Pre Release Event. Starring Kajal Aggarwal, Nithya Menen, Regina Cassandra, Eesha Rebba, Srinivas Avasarala, Priyadarshi Pulikonda, Murali Sharma, Rohini Molleti. Voice over by Natural Star Nani and Mass Maharaja Ravi Teja. Directed by Prasanth Varma, Music is composed by Mark K Robin, Produced by Prashanti Tipirneni and Presented by Natural Star Nani under Wall Poster Cinema banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu