»   » రాజమౌళికు ప్రియాంక చోప్రా నుంచే ట్విస్ట్, ఫైనల్ గా ఏమౌతుందో

రాజమౌళికు ప్రియాంక చోప్రా నుంచే ట్విస్ట్, ఫైనల్ గా ఏమౌతుందో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పటిలాగే.. 'ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినీలను అనౌన్స్ చేసింది సీఎన్ ఎన్ న్యూస్ 18 గ్రూప్. అయితే ఈ జాబితాలో రాజమౌళి పేరు నామినేట్ చేయబడి ఉండటంతో ఆయన అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. అయితే ఆయనకు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నుంచి పోటీ ఎదురౌతోంది.

ఆ లిస్ట్ లో రాజమౌళి, ప్రియాంక చోప్రా,రణ్ వీర్ సింగ్, సంజయ్ లీలా భన్సాలీలు ఉన్నారు. రాజమౌళి తప్ప మిగిలినవారంతా బాలీవుడ్ సెలెబ్రెటీలు కావటం తెలుగు వారికి కొంచెం బాధించే విషయమే. అయినా రాజమౌళికు ఆ అవార్డ్ వస్తే మనకు ఆ బాధ తొలుగుతుంది.

ఇక ఇప్పటికి నామినేషన్స్ మాత్రమే అయినా ఓటింగ్, సెలక్షన్ అయి ఆ తర్వాత విన్నర్స్ ని అనౌన్స్ చేయడానికి మరికొన్ని నెలల సమయం పడుతుంది. అయితే ఇప్పటికే ఎన్నో దేశ విదేశీ అవార్డులను ఖాతాలో వేసుకున్న రాజమౌళికి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా దక్కాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

 Rajamouli nominated for CNN-IBN Indian Of The Year

కానీ రాజమౌళికి మాత్రం ప్రధాన పోటీ ప్రియాంక చోప్రా నుంచే అనే వార్తలు వస్తున్నాయి. ఈ ఆశక్తిక కర పోటీలో రాజమౌళి ప్రియాంక పై పైచేయి సాధిస్తాడా లేదా అన్న విషయం తేలాలి అంటే మరి కొన్నిరోజులు ఆగాలి..

ఇండియన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి సంబంధించి పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజమౌళి నామినేట్ అయ్యారు. ఆన్‌లైన్‌లో నిర్వహించే ఓ పోల్ ద్వారా ఎక్కువ ఓట్లు వచ్చిన వారికి ఈ అవార్డు ప్రకటించనున్నారు.

English summary
S S Rajamouli has been nominated for the Indian of the Year Awards for movies that is hosted by CNN News 18 group every year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu