twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'శిరిడి సాయి'పై రాజమౌళి కామెంట్

    By Srikanya
    |

    హైదరాబాద్ : షిర్డీసాయిగా నాగార్జున నటించిన శిరిడీ సాయి చిత్రం నిన్న(గురువారం)విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం చూసిన రాజమౌళి ఈ సినిమాపై తన ప్రతిస్పందనను ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో...ఈ చిత్రం ఓ పాత్రలోకి పూర్తిగా లీనమై ఓ నటుడు ఎలా చేస్తాడు అన్నదానికి మంచి ఉదాహరణ. హ్యాట్యాఫ్ టు నాగార్జున గారూ...నాకు అయితే బెన్ కింగ్స్ లే ...గాంధీగా,శ్రీకృష్ణుడుగా పెద్దాయన ఎంతలా ట్రాన్స్ ఫాం అయి చేసారో అలా నాగార్జున చేసారనిపించింది. నేను చాలా గర్వపడుతున్నాను..చాలా గౌరవిస్తున్నాను అని ట్వీట్ చేసారు.

    రాజమౌళి కి ఈ చిత్రం దర్శకుడు రాఘవేంద్రరావు గురువు. తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ ని రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలోనే చేసారు. ఆ సినిమా విజయంతో రాజమౌళి కెరీర్ ముందుకు వెళ్లింది. అందుకు ముందు కూడా రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం సీరియల్ కి రాజమౌలి దర్శకుడుగా పనిచేసారు. అలాగే ఈ శిర్డీ సాయి చిత్రానికి రాజమౌళి స్నేహితుడు వరా ముళ్లపూడి ఆన్ లైన్ ప్రొడ్యూసర్.

    అలాగే గతంలో నాగార్జున,రాజమౌళి కాంబినేషన్ లో రాజన్న చిత్రం వచ్చింది. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ డైరక్ట్ చేసిన ఆ చిత్రంలో నాగార్జున చేసిన సన్నివేసాలకు రాజమౌళి డైరక్టర్ గా వ్యవహించారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. కానీ అందులో యాక్షన్ సన్నివేసాలకు,ఎమోషన్ లకు సీన్స్ కు మంచి పేరు వచ్చింది.

    ప్రస్తుతం రాజమౌళి..ప్రభాస్ తో చేయబోయే చిత్రం కోసం స్క్రిప్టుని తయారు చేసుకుంటున్నారు. ఆ చిత్రం భారీ బడ్జెట్ తో ఉంటుందని సమాచారం. ఆ చిత్రానికి రాఘవేంద్రరావు నిర్మాత. ఆ సినిమా ఓ సోషియో ఫాంటసీ అని తెలుస్తోంది.ఆ సినిమా కోసం ప్రభాస్ సిక్స్ ప్యాక్ బాడీని సైతం తయారుచేసుకుంటున్నట్లు సమాచారం. రాజమౌళి,ప్రభాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ఛత్రపతి చిత్రం ఘన విజయం సాధించటంతో ఈ చిత్రంకూడా మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.

    English summary
    Rajamouli Tweeted: “one of the best examples of an actor transforming COMPLETELY into the role.Hats off to nagarjuna garu as SaiBaba. For me it is as good as Ben kingsley transforming into Gandhi and Peddayana tranforming into SriKrishna. I think Nag is destined for much much more. Proud&Respect!!”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X