»   » రియలైజైన రాజమౌళి..ఇపుడు తన భార్యను తిట్టడం లేదని ప్రకటన!

రియలైజైన రాజమౌళి..ఇపుడు తన భార్యను తిట్టడం లేదని ప్రకటన!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మగధీర, ఈగ, బాహుబలి లాంటి భారీ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు రాజమౌళి కేవలం సినిమాలు తీయడంలోనే కాదు....చక్కటి కాన్సెప్టుతో వచ్చే చిన్న సినిమాలను చూసి అభినందించడంలోనూ ముందుంటారు. ఆయన ఒక సినిమా చూసి దానికి 'బాగుంది' అనే సర్టిఫికెట్ ఇచ్చారంటే చాలు ఆ సినిమా హిట్టే. ప్రేక్షకుల్లో కూడా రాజమౌళి జడ్జిమెంటు మీద చాలా నమ్మకం.

ఇటీవల విడుదలైన మోహన్ లాల్ 'మనమంతా' సినిమా చూసిన రాజమౌళి ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చాలా బావుందని, దర్శకుడి తన కెరీర్లోనే బెస్ట్ స్క్రీన్ ప్లే అందించారని రాజమౌళి చెప్పుకొచ్చారు. మోహన్ లాల్, ఇతర నటీనటులపై కూడా రాజమౌళి పొగడ్తలు గుప్పించారు.


తనకు చాలా సన్నిహితుడైన సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం కావడంతో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ కల్పించే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు రాజమౌళి. సాధారణంగా ఏదైనా సినిమా బావుంటే కేవలం తన సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో మాత్రమే రాజమౌళి స్పందన ఉండేది. అయితే 'మనమంతా' సినిమా విషయంలో మాత్రం సినిమాను పొగుడుతూ వీడియో క్లిప్ పోస్టు చేసారు జక్కన్న.


అంతే కాదు... ఈ సినిమా చూసిన తర్వాత తనలో వచ్చిన మార్పును కూడా వివరించారు. ఇంతకు ముందు తన భార్య రమను ఓ విషయంలో తిట్టే వాడిని (టీజ్ చేయడం) ఈ సినిమా చూసిన తర్వాత తనలో మార్పు వచ్చిందని రాజమౌళి తెలిపారు.


రాజమౌళి తన భార్య ఏ విషయంలో టీజర్ చేసేవాడు? ఆయనలో మార్పు తెచ్చేంతగా సినిమాలో ఏముంది? అనే అంశాలు స్లైడ్ షోలో...


భార్య రమ గురించి..

భార్య రమ గురించి..


కాలేజ్ చదివే రోజుల్లో ఎన్.సి.సి. ద్వారా కెనడా వెళ్ళే ఛాన్సొచ్చా రమ వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళమ్మతో ఉండటమే ఇష్టమని చెప్పిందట అని రాజమౌళి గుర్తు చేసుకున్నాు.


రమ నిర్ణయంపై టీజ్ చేస్తుండేవాడిని

రమ నిర్ణయంపై టీజ్ చేస్తుండేవాడిని


రమ అలాంటి నిర్ణక్ష్ం తీసుకోవడంపై అప్పుడప్పుడూ తిడుతూ ఉండేవాడిని. ఒకవేళ కెనడా వెళ్ళుంటే లైఫ్ ఇంకోలా ఉండేది కదా అని టీజ్ చేస్తుండే వాడిని అని రాజమౌళి చెప్పుకొచ్చారు.


సినిమా చూసాక మారాను

సినిమా చూసాక మారాను


‘మనమంతా' సినిమా చూసాక రమను అలా అనడం మానేసాను అని రాజమౌళి తెలిపారు.


రాజమౌళిలో మార్పుకు కారణం..

రాజమౌళిలో మార్పుకు కారణం..


మనమంతా సినిమాలో గౌతమి రోల్ చూసాక తనలో మార్పు వచ్చిందని రాజమౌళి తెలిపారు.


గౌతమి పాత్ర ఇదే..

గౌతమి పాత్ర ఇదే..


సినిమాలో గౌతమికి సింగపూర్ వెళ్తే చాన్స్ వస్తుంది. డబ్బులు ఎక్కువొస్తాయి కాబట్టి భర్త ఓకె అంటాడు, తమ ఫ్యూచర్ బాగుంటుందని కొడుకు ఓకె అంటాడు. మా అమ్మ ఫ్లయిట్ లో వెళ్తోందని అందరికీ చెప్పుకుంటా అంటూ కూతురు వెళ్లమంటుంది. కాని తను లేకపోతే బాధపడతాం ఇబ్బందిపడతాం అని ఒక్కరూ చెప్పరేంటి అని ఆమె బాధపడుతుంది.


రమ కూడా అలానే ఆలోచించింది

రమ కూడా అలానే ఆలోచించింది


రమ కూడా అలానే ఆలోచించింది, అందుకే కెనడా వెళ్లలేదని నాకు ఇప్పుడు తెలిసొచ్చిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.


మనమంతా

మనమంతా


మనమంతా మంచి కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. సినిమా రియాల్టీకి దగ్గరగా, మధ్యతరగతి కుటుంబ జీవితానికి అద్దం పట్టేలా ఉండటంతో మంచి ఆదరణపొందుతోంది.


మంచి సినిమాకు పబ్లిసిటీ కరువు

మంచి సినిమాకు పబ్లిసిటీ కరువు


అయితే ఇలాంటి మంచి సినిమాకు పబ్లిసిటీ కొరత ఏర్పడిందనే ఉద్దేశ్యంతో రాజమౌళి ఈ బాధ్యత తీసుకున్నారు.


English summary
Rajamouli realize after Watching Manamantha. Director SS Rajamouli was all in praise for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X