»   » నా 'విజయసింహా' చిత్రం ఆగిపోయింది కానీ...రాజమౌళి

నా 'విజయసింహా' చిత్రం ఆగిపోయింది కానీ...రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

"నేనూ ప్రకాష్ కలిసి 'విజయసింహా' అనే చిత్రానికి పనిచేయాల్సింది. కానీ అది ఆగిపోయింది అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం విడుదల తర్వాత రాజమౌళి, రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాష్ కాంబినేషన్ లో 'విజయసింహా' అనే జానపద చిత్రం ప్లాన్ చేసారు. అందుకోసం ప్రకాష్ గుర్రపు స్వారీ, కత్తి తిప్పటం వంటివి కూడా ప్రాక్టీస్ చేసారు. అయితే రెండు రోజుల్లో షూటింగ్ అనగా ప్రకాష్ తన తండ్రి వద్దకు వచ్చి తాను చేయలేనని చేతులెత్తేసారు. అయితే అప్పుడు కలిగిన ఆ ఇంట్రస్టుతోనే ఆయన అనగనగా ఒక ధీరుడు చిత్రాన్ని రూపొందించారు. అలాగే రాజమౌళి...మగధీర చిత్రం చేసారు. ఇక ఈ విషయాన్ని రాజమౌళి...అనగనగా ఒక ధీరుడు ఆడియో పంక్షన్ లో ప్రస్తావించారు. అలాగే ప్రకాష్ గురించి చెబుతూ.. 'సినిమాను డిఫరెంట్‌గా చేద్దాం' అని అంటుండేవాడు. ఆ డిఫరెంట్‌కు అర్థం ఈ ట్రైలర్ చూశాక తెలిసొచ్చింది. అతని కథల్లో చందమామ కథలూ ఉంటాయి. ఇప్పటి హాలీవుడ్ టెక్నాలజీ కనిపిస్తుంది. సిద్ధార్థ ను ఈ సినిమా లవర్ ‌బోయ్ ఇమేజ్ నుంచి బయటపడేస్తుంది. మోహన్‌బాబుకి తాను గొప్ప నటుడినన్న గర్వం ఉంది. లక్ష్మీ ఆ గర్వాన్ని పోగొట్టాలని ఆకాంక్షిస్తున్నాను" అని రాజమౌళి అన్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu