»   » ‘స్పైడర్’ జోరు, రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

‘స్పైడర్’ జోరు, రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Spyder will break Baahubali records and set new records : Rajamouli

మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' మూవీ బుధవారం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా విడుదల చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు. ఆయన ఫాలోయింగుకు, ఆయన సినిమాకు ఉన్న డిమాండుకు ఏ మాత్రం తగ్గకుండా 'స్పైడర్' చిత్రాన్ని రికార్డు స్థాయి థియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

రాజమౌళి స్పందన

రాజమౌళి స్పందన

తాజాగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి ‘స్పైడర్' సినిమాపై స్పందించారు. మహేష్ బాబు కోరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ సినిమా అవుతుందని, సినిమా ఫలితం, కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు.

బాహుబలి రికార్డులను కూడా

బాహుబలి రికార్డులను కూడా

అంతే కాదు.... మహేష్ బాబు ‘స్పైడర్' మూవీ బాహుబలి రికార్డులను కూడా అధిగమించి సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు.

మనసులో మాట..

మనసులో మాట..

తన మనసులో ఏది ఉంటే అది తడుముకోకుండా బయటపెట్టే రాజమౌళి... మహేష్ బాబు-మురుగదాస్ సినిమాపై తనకు ఉన్న లవ్, రెస్పెక్ట్ పై విధంగా బయట పెట్టారు.

త్వరలో మహేష్-రాజమౌళి సినిమా

త్వరలో మహేష్-రాజమౌళి సినిమా

త్వరలో మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

English summary
Meanwhile all celebrities are wishing Spyder all the success and star director SS Rajamouli responded on Spyder and said that this could become the biggest film in the career of Mahesh Babu. That is not all he added that he also has doubts about Spyder and quipped that Spyder movie might even break Baahubali records and set new records also.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu