twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR బడ్జెట్ లెక్క, షాక్ ఇచ్చిన దానయ్య.. ఈ ఐడియా ఆ చిత్రం వల్ల వచ్చిందన్న రాజమౌళి!

    |

    జక్కన్న రాజమౌళి తాజాగా మీడియా సమావేశం నిర్వహించి ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాల్ని వెల్లడించారు. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1920 కాలం నాటి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు యుక్త వయసులో ఉన్న సమయంలో కొన్నేళ్లు అదృశ్యమై తిరిగి వచ్చి స్వాతంత్ర పోరాటం చేశారు. అదృశ్యమైన సమయంలో వీరిద్దరూ ఎలా ఉండేవారు అనేదే ఈ చిత్ర కథ అని రాజమౌళి తెలిపారు. ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

    షాక్ ఇచ్చిన దానయ్య

    షాక్ ఇచ్చిన దానయ్య

    మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్ర నిర్మాత దానయ్య మాట్లాడుతూ సంచలన విషయాన్ని ప్రకటించారు. అంతా ఆర్ఆర్ఆర్ చిత్రం 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోందని భావిస్తున్నారు. దానయ్య మాట్లాడుతూ ఈ చిత్రానికి 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంటే తెలుగులో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ఇదే.

     వర్కౌట్ అవుతుందా

    వర్కౌట్ అవుతుందా

    మన తెలుగు వీరుల కథ ఇతర భాషలో వర్కౌట్ అవుతుందా అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. తెలుగు వీరుల కథ అందరికి తెలియాలి. చాలా మంది వీరుల కథలు ప్రపంచానికి తెలియకుండా మరుగున పడిపోయాయని రాజమౌళి అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ల గురించి మాట్లాడుతూ.. బాహుబలి తరహాలో ప్రతి చిత్రంలో మహిళలకు బలమైన పాత్రలు రూపొందించాలని అనుకోను. అది కథని బట్టి ఉంటుంది. కానీ ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర కథని మలుపు తిప్పే విధంగా ఉంటుందని రాజమౌళి అన్నారు.

    ‘ఆర్ఆర్ఆర్' రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రెస్ మీట్, గుడ్‌లక్ చెప్పిన ఉపాసన!‘ఆర్ఆర్ఆర్' రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రెస్ మీట్, గుడ్‌లక్ చెప్పిన ఉపాసన!

     రాంచరణ్, ఎన్టీఆర్ లుక్స్

    రాంచరణ్, ఎన్టీఆర్ లుక్స్

    ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ లుక్స్ గురించి మాట్లాడుతూ.. కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు ఎలా ఉండేవారో మనందరికీ తెలుసు. ఆ కథ మనకు తెలిసినదే. కానీ అదృశ్యమైనప్పుడు వారు ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. అందువల్ల ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్‌ని తనకు నచ్చిన విధంగా చూపించే సౌలభ్యం ఉందని రాజమౌళి తెలిపారు. ఆ రెండేళ్లలో వాళ్ళిద్దరూ ఏం చేశారు అనే కథ ఈ చిత్రంలో ఉంటుంది. వాళ్ళు తిరిగి రావడంతో చిత్రం ముగుస్తుందని రాజమౌళి అన్నారు.

     ఐడియా నాదే

    ఐడియా నాదే

    ఆర్ఆర్ఆర్ చిత్ర ఐడియా నాదే అని రాజమౌళి తెలిపారు. మోటార్ సైకిల్ డైరీ అనే చిత్రాన్ని చూసిన తర్వాత ఈ ఆలోచన తట్టినట్లు రాజమౌళి తెలిపారు. రాంచరణ్ మాట్లాడుతూ నాన్నగారు సైరా చిత్రం చేయడం, నేను ఈ చిత్రంలో నటిస్తుండడం అంతా యాదృచ్చికంగా జరిగిందని రాంచరణ్ తెలిపారు. అరవింద సమేతలో రాయలసీమ యాసలో నటించారు. ఇప్పుడు ఈ చిత్రం కోసం తెలంగాణ యాస ప్రాక్టీస్ చేస్తున్నారా అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ.. కొమరం భీమ్‌ది ఏ మాండలికమో నాది కూడా అదే మాండలికం అని ఎన్టీఆర్ తెలిపాడు.

    English summary
    Rajamouli Reveals how he gets idea of RRR movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X