»   » ‘బాహుబలి 2’ ట్రైలర్‌ లో చిన్న విజువల్ బయిటకు.. చూశారా! (వీడియో)

‘బాహుబలి 2’ ట్రైలర్‌ లో చిన్న విజువల్ బయిటకు.. చూశారా! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' థియేట్రికల్‌ ట్రైలర్‌ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌ మార్చి 16న విడుదల.. అని తేదీ వెల్లడించిన రోజు నుంచి చిత్ర యూనిట్ తమదైన శైలిలో పబ్లిసిటీ పోస్టర్స్ ని విడుదల చేస్తూ ఆకట్టుకుంటోంది.

ఇప్పటికే విడుదల చేసిన రెండు పోస్టర్స్ అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా 12 సెకన్లతో కూడిన వీడియోను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. రక్తమోడుతున్న ప్రభాస్‌ను సగం మాత్రమే ఇందులో చూపించారు. ఈ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.రిలీజ్ డేట్, ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అవటంతో ... టీమ్ లో మరింత ఉత్సాహం పొంగిపొరలుతోంది. అందుకు తగినట్లేగానే ..ట్రైలర్ ఎలా ఉండబోతోందనే విషయం చెప్తూ ఓ పోస్టర్ విడుదల చేసారు. ఆ పోస్టర్ చూస్తే.. అంత ఆసక్తి ఎందుకో ఎప్పడెప్పుడు ట్రైలర్ చూద్దామా అనిపించటం ఖాయం. యుద్ధవీరుడిగా శివుడు(ప్రభాస్‌).. గాయాలతో భళ్లాలదేవ(రానా).. చేతిలో రాజదండం, తలపై అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్న కుంపటితో దేవసేన(అనుష్క), కదనరంగానికి దూకుతున్న కట్టప్ప(సత్యరాజ్‌), అవంతిక(తమన్నా).. ఉండగా, వీరి చుట్టూ యుద్ధ వాతావరణం ఉన్న ఈ ప్రచార చిత్రం నిజంగానే మరింత ఆసక్తి, అంచనాలను పెంచుతోంది.


రాజమౌళి చెప్పేదాని ప్రకారం.... మార్చి 16న ఉదయం ఈ బాహుబలిః ది కంక్లూజన్ ట్రైలర్ రిలీజవుతుంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ ను ఉదయం 10 గంటల సమయానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ధియేటర్లలో రిలీజ్ చేస్తారు తప్పించి.. దీనిని ఆన్ లైన్లో మాత్రం రిలీజ్ చేయరు. ధియేటర్లలో ట్రైలర్ ను చూసేసిన తరువాత.. అప్పుడు సాయంత్రం 5 గంటలకు యుట్యూబ్ లో రిలీజ్ చేస్తారట.


బాహుబలి 1 సినిమా రిలీజ్ సమయంలో కూడా.. ముందుగా ట్రైలర్ ను ధియేటర్లలో వేసిన తరువాతనే యూట్యూబ్ లో పెట్టారు. ఇప్పుడు బాహుబలి 2 విషయంలో కూడా సేమ్ టు సేమ్ అదే ఫాలో అవుతున్నారనమాట.


ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై రాఘవేంద్రరావు సమర్పిస్తుండగా, శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. 'బాహుబలి: ది బిగినింగ్‌'కు కొనసాగింపుగా వస్తున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Director S S Rajamouli 'Baahubali 2' triler will be released on 16th March. Now it's trailer's teaser released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu