For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'బాహుబలి 2' క్లైమాక్స్-కొత్త వార్త, ఈలోగా గేమ్స్ తో కాలం గడపాలి

  By Srikanya
  |

  హైదరాబాద్ : చూస్తూంటే 'బాహుబలి 2' ఇంకా లేటయ్యేటట్లు ఉంది. కానీ అప్పటివరకూ ఈ క్రేజ్ మాత్రం తగ్గకూడదు. అలాగని టీజర్లు, ఫస్ట్ లుక్ లు వంటివి వదలేం. మరి ఏం చేయాలి...ఇదే బాహుబలి టీమ్ ఆలోచన. ఎందకంటే తొలి భాగం ఘనవిజయం సాధించటంతో బాహుబలి పార్ట్ 2 మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దానిని అందుకోవాలి.

  మరోప్రక్క బాహుబలి 2 సినిమా విడుదలకు ఏడాది సమయం ఉండటంతో ఈ హైప్ ఇలాగే కంటిన్యూ చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా. అందులో భాగంగానే హాలీవుడ్ తరహాలో సినిమా క్యారెక్టర్స్ తో బొమ్మలు, వీడియో గేమ్ లు రూపొందించి మార్కెట్ లోకి రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

  బాహుబలి చిత్రంలోని మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ చిత్ర విడుదల సమయంలో.. చిత్రంలోని ఒక్కొక్క పాత్రను రివీల్ చేస్తూ చిత్రంపై భారీగా అంచనాలుపెంచేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బాహుబలి చిత్రంలోని రెండవ భాగం బాహుబలి ది కంక్లూషన్ చిత్రంపై అదే స్థాయిలో అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

  ఈ చిత్రానికి సంబంధించిన గేమ్స్, కామిక్స్, నావల్స్ ను త్వరలో విడుదల చేయనున్నారు. గ్రాఫిక్ ఇండియాతో కలిసి బాహుబలి గేమ్ ను త్వరలో విడుదల చేయనున్నారు .దీనికి సంబంధించిన పోస్టర్ ను రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, గ్రాఫిక్ ఇండియా కో ఫౌండర్ శరద్ దేవరాజన్ లు విడుదల చేయనున్నారు.

  ఈ గేమ్ త్వరలోనే విడుదల కానుండగా.. బాహుబలిని కాటప్ప ఎందుకు చంపాడు.. అనే సస్పెన్స్ ఇందులో ఉంటుందా.. ఉంటే సొల్యూషన్ ఎలా ఉండనుంది అన్న విషయాలు గేమ్ లో ఉండే అవకాశం ఉంది.

  ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో క్లైమాక్స్ పార్ట్ షూటింగ్ జరుపుకుంటోంది. హలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

  అలాగే ..తొలి భాగం క్లైమాక్స్‌ కోసం వెయ్యిమంది జూనియర్‌ ఆర్టిస్టుల్ని మాత్రమే వినియోగించిన రాజమౌళి.. 'కంక్లూజన్‌' క్లైమాక్స్‌ మాత్రం ఏకంగా 5 వేల మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య చిత్రీకరిస్తున్నాడని సమాచారం.

  స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

  మరింత భారీగా

  మరింత భారీగా

  బాహుబలి మొదటి భాగం కన్నా ... 'బాహుబలి 2' ఇంకా భారీగా ఉంటుంది

  రానా మాట్లాడుతూ ...

  రానా మాట్లాడుతూ ...

  ''సినిమాలో నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. దీనికి కారణం రాజమౌళీయే. ఆయన నా పాత్రను ఎన్నో జాగ్రత్తలతో తీర్చిదిద్దారు. నా పాత్రే కాదు అన్ని పాత్రలూ అద్భుతంగా వచ్చాయి. సినిమా కోసం ప్రభాస్‌, నేను చాలా కష్టపడ్డాం. ఇప్పుడు సినిమా సాధించిన విజయంతో దాన్ని మరచిపోయాం'' అన్నాడు.

  చాలా చిన్నది

  చాలా చిన్నది

  'బాహుబలి' రెండో భాగం ఎలా ఉండబోతోంది అంటే ''బాహుబలి - ది కంక్లూజన్‌' వచ్చాక 'బాహుబలి - ది బిగినింగ్‌' చాలా చిన్నదిగా కనిపిస్తుంది.

  సెట్స్, బావోద్వేగాలు

  సెట్స్, బావోద్వేగాలు

  రెండో భాగంలో పోరాట సన్నివేశాలు, భావోద్వేగాలు, సెట్లు... ఇలా అన్నీ ఇంకా భారీగా ఉంటాయ''అన్నాడు రానా.

  బాలీవుడ్ ఎదురుచూపు

  బాలీవుడ్ ఎదురుచూపు

  రాజమౌళి సృష్టించిన అపురూప దృశ్యకావ్యం 'బాహుబలి'ని చూసి మురిసిపోనివారు లేరు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను చాలా మంది బాలీవుడ్‌ నటులు వీక్షించారు. రాజమౌళి పనితీరు, నటీనటుల ప్రతిభను తెగ పొగిడేస్తోంది బాలీవుడ్‌.

  సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ

  సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ

  ''సినిమా అద్భుతంగా ఉంది. అందులో రానా నటన ఇంకా బాగుంది. ఇలాంటి సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో రావడం మంచి పరిణామం. రానా సినిమాల్లోకి రాకముందు 'నువ్వు సినిమాల్లోనే నటించు' అని ఎందుకనేవాడినో రానాకు ఇప్పుడు అర్థమైందనుకుంటా. ఎందుకంటే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కావలనుకునేవాడు'' అని చెప్పేవాడు రానా అన్నారు.

  రిలీజ్ డేట్

  రిలీజ్ డేట్

  బాహుబలి-2 రిలీజ్ డేట్ విషయాన్ని బాలీవుడ్ పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏప్రిల్ 14, 2017లో బాహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ చేస్తున్నట్లు ఆయన ఖరారు చేసారు.

  భారీ రిలీజ్

  భారీ రిలీజ్

  బాలీవుడ్ లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. తొలి భాగం కంటే భారీ స్థాయిలో బాహుబలి-2 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 'బాహుబలి-2' రిలీజ్ కావడానికి ఇంకా సంవత్సరానికి పైగా టైం ఉంది.

  భారీగా ప్రమోషన్స్

  భారీగా ప్రమోషన్స్

  ఈ గ్యాపులో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  ఏర్పాట్లు

  ఏర్పాట్లు

  బాహుబలి పార్ట్ 1 విడుదల సందర్భంగా తెలుగునాట థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టికెట్ల కోసం గొడవలు జరిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి అలాంటి ఇబ్బందులు, బ్లాక్ మార్కెటింగ్ లాంటివి జరుగకుండా పకడ్భంధీ ఏర్పాట్లు చేయనున్నారు.

  అంత ఖర్చా

  అంత ఖర్చా

  సెకండ్ పార్ట్ కోసం దాదాపు రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తారని తెలుస్తోంది.

  వర్కింగ్ డేస్

  వర్కింగ్ డేస్

  మొత్తం 170 నుండి 190 వర్కింగ్ డేస్ లలో షూటింగ్ పార్ట్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసారు.

  బ్రేక్

  బ్రేక్

  యూనిట్ సభ్యులు ప్రతి షెడ్యూల్ కు మధ్య 10 నుండి 20 రోజులు బ్రేక్ తీసుకుంటారని సమాచారం.

  'బాహుబలి 2' వర్కింగ్ స్టిల్స్ ( ఫోటోలు), 30 కోట్లు పదివారాలకు ఖర్చు

  'బాహుబలి 2' వర్కింగ్ స్టిల్స్ ( ఫోటోలు), 30 కోట్లు పదివారాలకు ఖర్చు

  ప్రభాస్ మొత్తం 10 నెలల పాటు ఈ షూటింగులో గడపనున్నాడు.

  మొత్తం ఇక్కడే

  మొత్తం ఇక్కడే

  2016 సంవత్సరం మొత్తం దాదాపుగా‘బాహుబలి-2' షూటింగులో గడిచిపోనున్న నేపథ్యంలో ప్రభాస్ ఇతర సినిమాలేవీ కమిట్ కావడం లేదు.

  కొత్త పాత్రలు

  కొత్త పాత్రలు

  సెకండ్ పార్టులో కొన్ని అడిషనల్ క్యారెక్టర్లు కూడా క్రియేట్ చేసినట్లు సమాచారం.

  బాలీవుడ్ నుంచి కూడా

  బాలీవుడ్ నుంచి కూడా

  సౌత్ తో పాటు బాలీవుడ్ నుండి పలువురు స్టార్స్ ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ లోనూ బారీగా రిలీజ్ అందుకే ఈ ఏర్పాట్లు అని తెలుస్తోంది.

   ప్లానింగ్ దెబ్బతింది

  ప్లానింగ్ దెబ్బతింది

  ఈ సారి సమ్మర్ రాజమౌళి ప్లానింగ్ ని దెబ్బ కొట్టింది. ఉష్ట్రోగతలు ఎక్కువగా నమోదు అవటంతో షూటింగ్ కు నెల బ్రేక్ ఇచ్చారు.

  ఈ రోజు నుంచే

  ఈ రోజు నుంచే

  ఇక గ్యాప్ ఇచ్చి మళ్లీ కదన రంగంలోకి వచ్చిన రాజమౌళి..క్లైమాక్స్ నిీ ఈ 13న ప్రారంబిస్తున్నారు.

  పది వారాలు

  పది వారాలు

  ఈ క్లైమాక్స్ పదివారాలు పాటు సాగనుందని నిర్మాతలు తెలియచేసారు

  సంక్లిష్టంగా

  సంక్లిష్టంగా

  ఈ క్లైమాక్స్ అత్యంత సంక్లిష్టమైన సవాల్ తో కూడి ఉంటుందని చెప్తున్నారు.

  మొత్తం

  మొత్తం

  ప్రధాన తారాగణమంతా ఈ క్లైమాక్స్ లో పాలుపుంచుకోనుంది.

  మూడింతలు

  మూడింతలు

  ఈ క్లైమాక్స్ పూర్తైతే మూడింతలు షూటింగ్ పూర్తైనట్లే అని చెప్తున్నారు.

  రామౌజి ఫిల్మ్ సిటిలో

  రామౌజి ఫిల్మ్ సిటిలో

  మొదటి నుంచి షూటింగ్ చేస్తూ వస్తున్న రామోజీ ఫిల్మ్ సిటిలోనే క్లైమాక్స్ షూట్ జరగనుంది.

  రిలీజ్ డేట్స్ మార్చకూడదని

  రిలీజ్ డేట్స్ మార్చకూడదని

  మొదటి భాగానికి జరిగినట్లుగా రిలీజ్ డేట్ల మార్పు..ఈ సారి ఉండకూడదని రాజమౌళి బావిస్తున్నారు.

  కండలు పెంచి

  కండలు పెంచి

  ఈ పార్ట్ కోసం ప్రభాస్, రానా తమదైన శైలిలో కండలు పెంచి రెడీ అయ్యారు.

  ఉత్సాహంతో

  ఉత్సాహంతో

  ఈ క్లైమాక్స్ ని అద్బుతంగా తీర్చి దిద్దాలని, దానిపైనే విజయం స్దాయి ఆధారపడి ఉంటుందని టీమ్ కెప్టెన్ ..రాజమౌళి తన టెక్నికల్ టీమ్ కు చెప్పి, పనిచేస్తున్నారు.

  English summary
  In Baahubali first part, Rajamouli utilized 1000 junior artists for the climax sequences, now in the 2nd part he appointed 5000 junior artists for the war sequences. It looks like Baahubali part 2 climax is much bigger than Baahubali Part 1 climax.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X