»   » 'బాహుబలి‌' నుంచి ఇంకో సాంగ్ (కొత్త వీడియో)

'బాహుబలి‌' నుంచి ఇంకో సాంగ్ (కొత్త వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై‌:భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ చిత్రం 'బాహుబలి-ద బిగినింగ్‌' భారీ రికార్డులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయినా ఇప్పటికీ కలెక్షన్‌ల మోత మోగిస్తూనే ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం నుంచి ఇంకో పాటను విడుదల చేసారు నిర్మాతలు. ఆ పాటను ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి.


మరో ప్రక్క ఈ చిత్రం హిందీ వెర్షన్ సైతం కలెక్షన్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ హిందీలో డబ్బింగ్‌ అయిన చిత్రాలు ఏవీ అందుకోలేని స్థాయికి బాహుబలి చేరింది. హిందీలో ఈ సినిమా ఇప్పటి వరకూ రూ.85.71 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్‌ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం కలెక్షన్స్ విషయానికి వస్తే...


ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.
రూ.100కోట్లు.. 200.. 300.. కోట్లు దాటిపోయింది. ప్రస్తుతం బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా రూ.355కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇంకేముంది రూ.500కోట్ల కలెక్షన్‌ సినిమాలో జాబితాలో చేరేందుకు దూసుకెళ్తోంది.


Rajamouli's Baahubali another song

అంతేకాదు బాలీవుడ్‌లో అధిక వసూళ్లు సాధించిన సినిమాలతో పోటీ పడుతోంది. జులై 17న విడుదలైన బాలీవుడ్‌ సినిమా 'భజరంగీ భాయీజాన్‌' ప్రపంచవ్యాప్తంగా రూ.226కోట్లు వసూలు చేసి ప్రస్తుతం బాహుబలికి గట్టి పోటీ ఇస్తోంది.


ఇక బాహుబలి సినిమా విడుదలైన తొలి రోజు నుంచే రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. జులై 10 శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన బాహుబలి ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.68కోట్ల షేర్‌ వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమ రికార్డుగా చెప్తున్నారు.


బాలీవుడ్‌లో షారూక్‌ ఖాన్‌ నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్‌' సినిమా తొలి రోజు రూ.65కోట్ల షేర్‌ సాధించినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్‌ తొలిరోజు రికార్డులను బద్ధలు కొట్టేసింది.

English summary
Watch Dheevara Video Song from Baahubali - The Beginning directed by Rajamouli.
Please Wait while comments are loading...