»   »  'బాహుబలి' కు ఊహించని షాక్

'బాహుబలి' కు ఊహించని షాక్

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి' అభిమానులకు షాక్ కలిగినట్లైంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ) 2015లో ఈ చిత్రం అర్హత సాధించలేకపోయింది. కేవలం బాహుబలికి మాత్రమే కాక శ్రీమంతుడు చిత్రానికి అదే పరిస్ధితి. ఇవి మాత్రమే కాక ఏ తెలుగు చిత్రమూ ఇఫి స్దాయిని చేరలేకపోయాయి.

గోవాలో ఈ నెల 20 నుంచి 30 వరకు ఈ చలన చిత్రోత్సవం జరగనుండటం తెలిసిందే. ఇఫీలో ఇండియా పనోరమ కేటగిరిలో 26 చిత్రాలను ప్రదర్శిస్తారు. బెంగాలీ నుంచి ఏడు చిత్రాలు, హిందీ నుంచి ఐదు, మలయాళం నుంచి నాలుగు చిత్రాలు ప్రదర్శనకు అర్హత పొందాయి.

Baahubali1

‘హోమేజ్‌' విభాగంలో బాలచందర్‌ రూపొందించగా, విశ్వనాథ్‌ సంగీతం సమకూర్చిన మరపురాని తెలుగు చిత్రం ‘మరో చరిత్ర', నిర్మాతగా రామానాయుడుకు మంచి పేరు తెచ్చిన ‘ప్రేమించు', ఏడిద నాగేశ్వరరావు నిర్మించగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగువాళ్ల కీర్తిపతాకను ఎగురవేసిన ‘శంకరాభరణం' చిత్రాలను ప్రదర్శించనున్నారు.

వీరి చిత్రాలతో పాటు సంగీత దర్శకులు రవీంద్ర జైన్‌, ఆదేశ్‌ శ్రీవాస్తవ, నటులు దేవేన్‌వర్మ, మనోరమ, ఇంద్ర బనియా, దర్శకులు నీరద్‌ మొహాపాత్ర (ఒడిషా), విద్యుత్‌ చక్రవర్తి (అస్సాం) పనిచేసిన చిత్రాలనూ ఈ విభాగంలో ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

నాలుగు జాతీయ పురస్కారాలు అందుకున్న కళాదర్శకుడు సాబు సిరిల్‌. ఆయనకు సృజనాత్మక బాధ్యతను అప్పజెప్పింది అంతర్జాతీయ భారతీయ చిత్రోత్సవ సంస్థ (ఇఫి). దీనికి సంబంధించిన అన్ని సెట్లను రూపొందించనున్నారు సాబు. భారతీయ సినిమా గొప్పతనం తెలిపేలా ఈ సెట్లను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారాయన.

Baahubali2

దీని గురించి సాబు సిరిల్‌ మాట్లాడుతూ ''ఆసియాలోని గొప్ప చిత్రోత్సవాల్లో ఒకటైన 'ఇఫి 2015'లో భాగం కావడం ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన ఇఫికి సంబంధించిన సెట్లను తీర్చిదిద్దే బాధ్యతను సక్రమంగా పూర్తిచేయగలుగుతానని నమ్ముతున్నా'' అని చెప్పారు.

''ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్న ఎన్నో భారతీయ చిత్రాలకు పనిచేశారు సాబు. ఆయన కళాత్మక దృష్టి ప్రత్యేకం. ఆయన దిశానిర్దేశంలో రూపొందించే సెట్లు 46వ చిత్రోత్సవాలకు వచ్చే సినీ అభిమానుల్ని కచ్చితంగా అలరిస్తాయ''న్నారు చిత్రోత్సవ డైరక్టర్‌ సి.సెంథిల్‌ రాజన్‌.

English summary
Not even a single Telugu film has been selected to be screened in the Indian Panorama section of the 46th International Film Festival of India (IFFI) 2015. Even SS Rajamoui's epic Baahubali, Mahesh Babu's Srimanthudu have failed to make it to the list.
Please Wait while comments are loading...