twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాత్రిళ్లు ఫుల్ బిజీగా రాజమౌళి

    |

    హైదరాబాద్: రాజమౌళి,ప్రబాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్ సీన్స్ తీస్తున్నారు. అందుకోసం రాజమౌళి రాత్రిళ్లు షూటింగ్ పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. ఎండలకు మండిపోకుండా రాత్రిళ్లు చేయటం హ్యాపీగా ఉందని అంటున్నారు.

    రాజమౌళి ట్వీట్ చేస్తూ..."గత కొంతకాలంగా ఎండలో షూటింగ్ చేస్తూ వచ్చిన మాకు రాత్రివేళ ఓపెన్ ఎయిర్ లో,చల్లటి వాతావరణంలో, నైట్ సీన్ చేయటం చాలా బాగుంది..;) "అన్నారు.

    Rajamouli's Bahubali in night shoot

    ఇక 'బాహుబలి' కోసం ఓ భారీ యుద్ధాన్ని తెరపై దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో కొన్నిటిని బ్లూ మ్యాట్ పై చిత్రీకరిస్తున్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడనివిధంగా ఉండాలని ఈ యుద్దం సన్నివేశాలను విదేశీ నిపుణుల సమక్షంలో తెరకెక్కిస్తున్నారు. సెకండాఫ్ లో వచ్చే ఈ యుద్దం సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు. దీనికి ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తారు.

    ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంతో పాటు రెండు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులపై యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఆరు నెలలు నుంచి చిత్రబృందం ప్రత్యేకంగా సన్నద్ధమై ముందుకు వెళ్తోంది. రెండు వేల మంది కళాకారులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఆ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు నెలల పాటు చిత్రీకరించనున్నారు.

    ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

    ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

    English summary
    Rajamouli tweeted” After shooting in blazing sun for the past few months, canning a night scene, tonight. Open air, cool breeze. Hope we don’t doze off..;) ” .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X