»   » రాజమౌళి 'బాహుబలి' కి బ్రేక్

రాజమౌళి 'బాహుబలి' కి బ్రేక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రభాస్‌, అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'బాహుబలి'. ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబరు 23 నుంచి నుంచి ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని రామోజీఫిల్మ్‌సిటీలో చిత్రీకరిస్తున్నారు. అయితే న్యూ ఇయిర్ సందర్బంగా రెండు రోజులు పాటు(అంటే ఈ రోజు డిసెంబర్ 31, రేపు జనవరి 1 వ తేదీ) రాజమౌళి బ్రేక్ ఇస్తున్నారు. అంటే తిరిగి జనవరి 2 నుంచి తిరిగి షెడ్యూల్ మొదలవుతుంది. ఈ యుద్దం ఎపిసోడ్ సినిమాలో హైలెట్ అని చెప్తున్నారు.

ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంతో పాటు రెండు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులపై యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దీనికోసం ఆరు నెలలు నుంచి చిత్రబృందం ప్రత్యేకంగా సన్నద్ధమవుతోంది. రెండు వేల మంది కళాకారులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఆ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు నెలల పాటు చిత్రీకరించనున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ '' 'బాహుబలి' యుద్ధం మొదలైంది. స్టోరీ బోర్డ్‌, ప్రి విజువలైజేషన్‌ వంటి పనులతో సన్నద్ధమయ్యాం'' అని తెలిపారు.

దీనికి ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తారు. ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

English summary
Prabhas most awaited film ‘Baahubali’ is racing at brisk pace. Currently film makers are canning war sequences smoothly and now film makers are planning to take two days break from shoot on 31st and 1st for the New Year as scheduled earlier. The shooting will resume on 2nd Jan 2014. Prabhas, RaNa, Anushka, Tamannaah are playing lead roles and SatyaRaj, Nasser and Sudeep will be seen in key roles. This film is being produced by Shobu Yarlagadda on Arka Media banner. Keeravani is tuning music for the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu