»   » షాకింగ్ ట్వీట్స్ :'గౌతమి పుత్ర శాతకర్ణి' లెటర్, క్రిష్...టీమ్ అత్యుత్సాహం పై రాజమౌళి సీరియస్

షాకింగ్ ట్వీట్స్ :'గౌతమి పుత్ర శాతకర్ణి' లెటర్, క్రిష్...టీమ్ అత్యుత్సాహం పై రాజమౌళి సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక్కోసారి తమ ప్రమోషన్ కోసం చూపించే అత్యుత్యాహం మొత్తాన్ని దెబ్బ తీస్తూంటుంది. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ విషయంలో అదే జరుగుతూంటుంది. సినిమా ప్రమోషన్ కోసం టీమ్ లను ఏర్పాటు చేస్తున్నారు. వారికి కొన్ని సూచనలు ఇచ్చి పనులు అప్పచెప్తూంటారు. వారు ఏ విధంగా అయితే జనాలను ఎట్రాక్ట్ చేయవచ్చో అనేది ప్లాన్ చేస్తూంటారు.

అయితే సినిమా మైలేజి కోసం ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేయటం కోసం ఒక్కోసారి అతిగా చేసే ఆ ప్రమోషన్స్ వికటిస్తూంటాయి. ఇప్పుడు క్రిష్ తాజా చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి కోసం రాజమౌళి రాసినట్లు మీడియాలో వచ్చిన లెటర్ అలాంటిదే. ఆ లెటర్ తాను రాయలేదని రాజమౌళి తెగేసి,ట్వీట్లతో ప్రపంచానికి చెప్పేసి, అసహనం వ్యక్తం చేసారు.


దాంతో తమ సినిమాకు ప్రమోషన్ గా మారుతుందనుకున్న రాజమౌళి లెటర్ వ్యవహారం బూమరాంగ్ గా మారింది. అసలు ఈ రోజుల్లో లెటర్ రాయటమేంటి..ట్వీట్స్ తో ఆల్రెడీ సినిమాపై తమ సమీక్ష లాంటి అభిప్రాయాన్ని రాజమౌళి చెప్పారు కదా అని చాలా మందికి సందేహం వచ్చింది. ఇప్పుడు అదే నిజమైంది.


ట్వీట్ రివ్యూ...

ట్వీట్ రివ్యూ...

తెలుగులో దాదాపుగా విడుదలయ్యే ప్రతి పెద్ద సినిమానూ చూస్తూ ఉండే రాజమౌళి, తాజాగా క్రిష్ తెరకెక్కించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను కూడా చూశారు. ఆ సినిమా చూసిన వెంటనే నందమూరి బాలకృష్ణను, క్రిష్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతూ ట్వీట్ కూడా చేశారాయన.


అభినందిస్తూ లేఖ

అభినందిస్తూ లేఖ

ఇక ఆ తర్వాత ఏకంగా సినిమా గురించి విశేషాలు తెలుసుకుంటూ క్రిష్‌తో ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు. వీటితో పాటు క్రిష్‌ను అభినందిస్తూ రాజమౌళి స్వయంగా ఒక లెటర్ రాసారంటూ ఈనాడు పేపర్లో వచ్చింది. అంజనాపుత్ర క్రిష్ అంటూ మొదలుపెట్టి రాజమౌళి ఆ లేఖలో క్రిష్‌పై ప్రశంసలు కురిపించారు.


లెటర్ లో ఏముంది

లెటర్ లో ఏముంది

క్రిష్ కు రాసానని చెప్పబడుతున్న లెటర్ లో .... 79 రోజుల్లో గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి ఒక సినిమాను పూర్తి చేయడం అభినందించదగ్గ విషయమని రాజమౌళి అన్నారు. ఇక చివర్లో ఇట్లు రాజనందిని పుత్ర రాజమౌళి అంటూ సినిమా టైటిల్ స్టైల్‌ను రాజమౌళి ఫాలో అవ్వడం ఆసక్తికరంగా కనిపించింది.


ఆశ్చర్యం వ్యక్తం చేసారు

ఆశ్చర్యం వ్యక్తం చేసారు

రాజమౌళి క్రిష్ ని ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ ఛానళ్లలో ప్రసారం అయింది. అలాగే ఈ చిత్రం పై ఇంటర్వ్యూ లో రాజమౌళి కురిపించిన ప్రశంసలను రాజమౌళి రాసిన లేఖ గా చిత్రీకరించి ప్రింట్ మీడియాలలో పబ్లిష్ చేశారు. ఇలా జరగడంపై రాజమౌళి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.


ఇంటర్వూ చేసాను

తనకు ‘గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా నచ్చిన మాట వాస్తవమే అని, ఈ సినిమా ప్రచారం కోసం.. క్రిష్ ను ఇంటర్వ్యూ చేయాలని తనను కోరారని, దానికి సమ్మతించాను అని రాజమౌళి ట్వీట్ చేశాడు.


ఇంటర్వూ లాగ వేస్తామన్నారు

క్రిష్ ని తాను చేసిన ఆ ఇంటర్వ్యూను టీవీలో ప్రదర్శించుకుంటాం, అలాగే పేపర్లో కూడా ఇంటర్వ్యూ క్రింద ప్రచురించుకుంటామని అడిగారని.. దానికి కూడా సమ్మతం తెలిపానని రాజమౌళి తెలిపాడు.


క్రిష్ ని ప్రశ్నించా

అయితే.. దాన్ని ఇంటర్వూలా ప్రచురిచంకుండా, ఓవర్ డ్రామా లా లెటర్ లాగ మార్చారు, ఈ విషయమై నేను క్రిష్ ని ప్రశ్నించాను


ఇంకా రిప్లై రాలేదు

క్రిష్ దానికి రిప్లై తన టీమ్ అత్యుత్సాహంతో చేసిన పని ఇదని అన్నారని చెప్పారు. అలాగే ఆ టీమ్ నుంచి తాను క్లారిపికేషన్ కోసం చూస్తున్నానని, ఇంకా అక్కడ నుంచి ఏ స్పందన రాలేదని అన్నారు.


అభిప్రాయం మారలేదు

సినిమా మీద నా అభిప్రాయమేమి మారలేదు. ఇంకా ఎంతో కలెక్టు చేయాలని కోరుకుంటున్నా. కేవలం ఆ ఉత్తరం నేను రాయలేదని మాత్రమే చెప్తున్నా అని క్లారిఫై చేసారు రాజమౌళి


ఎందుకు రాజమౌళి

ఎందుకు రాజమౌళి

రాజమౌళి ఈ విషయం ప్రస్దావిస్తూ ఎందుకు ఇలా ట్వీట్స్ చేసారనే విషయం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే తాను రాయని లెటర్ ని తను రాసినట్లుగా సృష్టించటం..రాజమౌళికు బాధకలిగించి ఇలా ట్వీట్స్ ద్వారా తన అభిమానులకు ఆయన వివరణ ఇచ్చారని తెలుస్తోంది.


రాజమౌళి రివ్యూ

రాజమౌళి రివ్యూ

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని మొదటి రోజు స్పెషల్ షో చూసిన రాజమౌళి వెంటనే స్పందించారు. ఈ సినిమాపై ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రసంశల జల్లు కురిపించారు. ముందుగా బాలకృష్ణని ఉద్దేశించి ట్వీట్ చేసారు. సాహో బసవతారకరామపుత్ర అన్నారు.


ఇదిగో బాలయ్య ‘గౌతమిపుత్ర శాతకర్ణి' రాజమౌళి రివ్యూశాతకర్ణి ఇలా ఉందంటే

శాతకర్ణి ఇలా ఉందంటే

సంక్రాంతి కానుకగా విడుదలైన ...బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఫ్యాన్స్ ఆనందంతో చేసే నినాదాలతో థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయి. ఈ నేపధ్యంలో చిత్రం రివ్యూ ఇక్కడ చదవండి


సాహో క్రిష్...మీసం తిప్పాల్సిందే! కానీ....(రివ్యూ: గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి )వాళ్లందరికీ నచ్చింది

వాళ్లందరికీ నచ్చింది

సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపధ్యంలో బాలయ్యతో రెండు సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన దర్శకుడు బోయపాటి శ్రీను,మరికొంత మంది సెలబ్రెటీలు ఏమన్నారో క్రింద చూద్దాం


‘శాతకర్ణి' పై బోయపాటి, బన్ని, సాయి ధరమ్ తేజ, నితిన్ ..ఇలా అందరూ


English summary
Recently leading Telugu newspaper published a letter saying that Rajamouli specifically wrote a letter to Krish praising him.Taking things for granted, the PR team of Krish has fabricated Rajamouli’s interview into a written letter and released it to media. Rajamouli openly condemned Krish and his team for their exagerration and over enthusiasm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu