»   » రాజమౌళి స్పందించడం చాలా సంతోషంగా ఉంది

రాజమౌళి స్పందించడం చాలా సంతోషంగా ఉంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మను 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్ర బృందం ఈరోజు ఉదయం దర్శించుకుంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌,హీరోయిన్ శ్రియ కలిసి ఉదయం అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం వారు అంతరాలయంలో దుర్గమ్మను దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో చిత్ర యూనిట్ కి ఆశీస్సులు అందించారు. అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో ఉన్న భక్తులు బాలకృష్ణకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను ప్రజలంతా సంప్రదాయాలను కాపాడేలా సుఖసంతోషాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తన చిత్రానికి అభిమానుల నుంచి ప్రశంసలు దక్కడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది తన సొంతూరిలో సంక్రాంతి వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు.

దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ... 'గౌతమిపుత్ర శాతకర్ణి'పై రాజమౌళి స్పందించడం సంతోషంగా ఉందని చిత్ర దర్శకుడు క్రిష్ అన్నారు. విజయవాడలో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాకు హిట్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు.

అభిమానుల మధ్య కూర్చుని సినిమా చూడడం గొప్ప అనుభూతని క్రిష్ పేర్కొన్నారు. ఈ సినిమాను ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని క్రిష్ చెప్పారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తక్కువ రోజుల్లో పూర్తవడానికి బాలకృష్ణ ఎంతగానో సహకరించారన్నారు. ఆయన అండతోనే సినిమా తక్కువ రోజుల్లో పూర్తయిందని తెలిపారు.

Rajamouli's Review of Gautamiputra Satakarni

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో బెనిఫిట్ షోలు ప్రదర్శంచారు. చిత్ర హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ అభిమానులతో కలిసి ఈ చిత్రాన్నిచూసారు. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నారా రోహిత్‌ సహా పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసారు. బాలకృష్ణ అభినయం, డైలాగులకు ప్రేక్షకుల విశేష స్పందన వచ్చింది. ఈ నేపధ్యంలో రాజమౌళి తన అభిప్రాయన్ని తెలియచేసారు.


రాజమౌళి నిన్న 'గౌతమిపుత్ర శాతకర్ణి' చూసిన అనంతరం చిత్ర యూనిట్‌పై ప్రసంశల జల్లు కురిపించారు. 'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని ఆయన తెలిపారు. ఈ సినిమాను 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని రాజమౌళి అన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత దర్శకుడు క్రిష్‌ నుంచి తాను ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా 'శాతకర్ణి' చిత్రాన్ని క్రిష్‌ తెరకెక్కించారని రాజమౌళి తెలిపారు. తెలుగు చిత్రాల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అజరామరం అని రాజమౌళి పేర్కొన్నారు.


దర్శకుడు క్రిష్‌ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని.. 12కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా తెరకెక్కించారని కొనియాడారు.

'శాతకర్ణి' అద్భుత కావ్యంలా ఉందని.. దీన్ని 79 రోజుల్లో తెరకెక్కించారంటే నమ్మశక్యంగా లేదని వ్యాఖ్యానించారు.

రచయిత సాయిమాధవ్‌ సంభాషణలు, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. తెలుగు చిత్రాల్లో 'గౌతమిపుత్ర శాతకర్ణి' అజరామరంగా నిలుస్తుందని రాజమౌళి అన్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం' గౌతమిపుత్ర శాతకర్ణి'. ఆయన కెరీర్‌లో వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో అటు అభిమానులే కాదు ఇటు సగటు ప్రేక్షకుల్లోనూ సినిమాపై అమితాశక్తి నెలకొంది.

English summary
SS Rajamouli watched the First Day First Show of 'Gautamiputra Satakarni' and tweeted.. 'Saaho Basavatarakarama puthra BALAKRISHNA!!! Now Krish said thanks to Rajamouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu