»   » రాజమౌళి షేర్ చేసిన ఫోటో, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయట.. భగత్ సింగ్ ఇక్కడే!

రాజమౌళి షేర్ చేసిన ఫోటో, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయట.. భగత్ సింగ్ ఇక్కడే!

Subscribe to Filmibeat Telugu

దర్శక ధీరుడు రాజమౌళి పాక్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు తెరకేకించిన ఈ చిత్రం పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడింది. బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాహుబలి చిత్రంతో రాజమౌళి అంతర్జాతీయ వ్యాప్తంగా ఖ్యాతి గడించాడు.

రాజమౌళి పాక్ లోని చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శించాడు. లాహోర్ లోని సద్మన్ చౌక్ సందర్శించిన రాజమౌళి ఆ ఫోటో ని ట్విట్టర్ లో షేర్ చేయడం విశేషం. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ ని బ్రిటిషు వారు ఉరి ప్రాంతం ఇదే. ఈ ప్రదేశాన్ని చూస్తుంటే తన రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని రాజమౌళి ట్విట్టర్ లో స్పందించాడు.

ఇదిలా ఉండగా బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి.. రాంచరణ్, ఎన్టీఆర్ తో భారీ మల్టీస్టారర్ చిత్రానికి తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

English summary
Rajamouli shares hysterical place from Pakistan. Rajamouli remembers Bhagat Singh death
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X