twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాండ్‌ కాగితంపై రాసిస్తా: రాజమౌళి

    By Srikanya
    |

    బాండ్ పేపర్ మీద రాసిస్తాను... హను కచ్చితంగా గొప్ప దర్శకుడు అవుతాడు. ఇది నా సినిమాలాంటిదే. ఐదేళ్ల క్రితం హను రూపొందించిన షార్ట్ ఫిల్మ్ చూశాను. అత్యద్భుతంగా రూపొందిన లఘు చిత్రాల్లో అదొకటి అన్నారు రాజమౌళి. హను రాఘవపూడి దర్శకుడిగా పరిచయవుతున్న చిత్రం 'అందాల రాక్షసి'. ఈగ నిర్మాత సాయి కొర్రపాటి తమ వారాహి చలన చిత్ర పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. ఆ ఫంక్షన్ కి హాజరైన రాజమౌళి ఇలా స్పందించారు.

    అలాగే...ఈ చిత్రం నిర్మాత సాయి నా సినిమాలకు మంచి విమర్శకుడు. నన్ను పక్కా మాస్‌ చిత్రాల నుంచి కుటుంబ కథా చిత్రాలవైపు కూడా మళ్లించింది ఆయనే. పాటలు బాగున్నాయి అని అన్నారు. నవీన్‌, రాహుల్‌ హీరోలుగా లావణ్య హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాత. తొలి సీడీని డి.రామానాయుడు ఆవిష్కరించారు. కీరవాణి స్వీకరించారు. ప్రకటన చిత్రాన్ని రాజమౌళి విడుదల చేశారు.

    దర్శకుడు హను మాట్లాడుతూ...సూర్యుడు, చంద్రుడు, భూమి మధ్య ఓ ప్రేమ కథ జరిగితే ఎలా ఉంటుందో మా సినిమాలో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి మధ్య సాగే ప్రేమ కథ కూడా అలానే ఉంటుంది. 1990ల్లో జరిగిన ప్రేమ కథ ఇది. ఓ అందమైన దృశ్య కావ్యంలా చూపించే ప్రయత్నం చేశాం. రధన్‌ అందించిన స్వరాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ ''మధురమైన బాణీలు ఇవ్వడానికి సరిపోయే ఓ చక్కటి ప్రేమ కథ ఇది. పాటలు శ్రోతలకు నచ్చుతాయని ఆశిస్తున్నాని''అన్నారు.

    అనంతరం డా. డి.రామానాయుడు మాట్లాడుతూ...''ఈ ట్రైలర్స్ కొత్తగా ఉన్నాయి. అంతా కొత్తవారితో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు. నవీన్, రాహుల్, లావణ్య ప్రధాన పాత్రల్లో హను రాఘవపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'అందాల రాక్షసి'. రధన్ సంగీతం అందించారు. ఈ కార్యక్రమంలో డి.సురేష్‌బాబు, స్రవంతి రవికిషోర్‌, బూరుగపల్లి శివరామకృష్ణ, పరుచూరి ప్రసాద్‌, అనిల్‌ సుంకర, దేవాకట్టా, సెంథిల్‌కుమార్‌, రమా రాజమౌళి, గుణ్ణం గంగరాజు తదితరులు పాల్గొన్నారు. వేల్‌ రికార్డ్స్‌ ద్వారా పాటలు విడుదలయ్యాయి.

    English summary
    'Eega' producer Sai Korrapati's second film 'Andhala Rakshasi' audio launched at Annapurna Studios. Rajamouli said that he can guarantee that Hanu Raghavapudi will become a great director in future. D.Ramanaidu, MM Keeravani, Burugupalli Siva Ramakrishna, Gunnam Gangaraju wished 'Andala Rakshasi' team good luck. Radhan is composing the music for this triangular love story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X