»   » రాజమౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన సలహా ఏమిటో? ఏం జరిగింది?

రాజమౌళి కూతురికి ఆ హీరో ఇచ్చిన సలహా ఏమిటో? ఏం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళి ట్విట్టర్లో చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల బాహుబలి-2 ఫస్ట్ లుక్ రిలీజ్ లో భాగంగా రాజమౌళి అండ్ బాహుబలి టీం ముంబై వెళ్లిన సంగతి తెలిసిందే. రాజమౌళితో ఫ్యామిలీ కూడా ఉంది.

Rajamouli

ఈ సందర్భంగా రాజమౌళి కూతురు బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను కలిసారట. దీని గురించి రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ...'నా కుమార్తెను కలిసినందుకు చాలా థ్యాంక్స్‌ సిద్ధార్థ్‌ మల్హోత్రా. ఆమె సూపర్ సూపర్ ఎగ్జైట్ అయింది. ఆమెకు సలహా ఇచ్చినందుకు థాంక్స్. మా జీవితాన్ని సులభతరం చేశారు' అంటూ రాజమౌళి ట్వీట్‌ చేశారు.

రాజమౌళి ట్వీట్ కు సిద్ధార్థ్‌ మల్హోత్రా రిప్లై ఇస్తూ..... 'హలో సర్‌.. మీకు పెద్ద ఫ్యాన్‌ని! థ్యాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె చాలా చక్కగా మాట్లాడింది. ఈసారి వచ్చినప్పుడు మిమ్మల్ని చూస్తానని ఆశిస్తున్నాను' అని సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు.

అయినా రాజమౌళి అండ్ ఫ్యామిలీ జీవితాలను సులభతరం చేసేలా వారి కూతురికి .... సిద్ధార్థ మల్హోత్రా ఏం సలహా ఇచ్చారు? అనేది హాట్ టాపిక్ అయింది.

English summary
"Thanks a lot S1dharthM for meeting my daughter. She is super super excited. And thanks for your advice to her. Makes our lives easier." Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu