»   » ఆ సినిమాకు రాజమౌళి ప్రశంస, ఇక హిట్టే...!

ఆ సినిమాకు రాజమౌళి ప్రశంస, ఇక హిట్టే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఏదైనా సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రాజమౌళి దాని గురించి తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ప్రశంసలు గుప్పిస్తే ఆ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అందుకు కారణం ఆయన జడ్జిమెంట్ సూపర్ గా ఉంటుందని సినీ జనాల నమ్మకం. గతంలో ఆయన ఇలా ప్రశంసలు గుప్పించిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తాజాగా నాని ‘భలే భలే మగాడివోయ్' సినిమా కూడా రాజమౌళి ప్రశంసించారు. ఈ సినిమా అందరినీ నవ్విస్తుందని కామెంట్ చేసారు.


నాని, లావణ్య త్రిపాఠిలు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భలే భలే మగాడివోయ్‌'.మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లుఅరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ట్రైలర్‌ను సైతం మంచి ఆదరణ పొందుతోంది. సెప్టెంబర్ 4న ఈ చిత్రం విడుదల చేయటానికి తేదీని ఖరారు చేసారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నివాస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఈ చిత్రంలో నాని మతిమరుపు కుర్రాడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు యువతనూ అలరిస్తుందని హీరో నాని హామీ ఇస్తున్నాడు. సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణలో నాని చిన్నపాటి ప్రమాదానికి గురైనా... వెంటనే షూటింగ్ లో పాల్గొని ఎంతో సహకరించాడని డైరెక్టర్ మారుతీ కితాబిచ్చాడు.


Rajamouli tweet about BBM

మురళిశర్మ, సితార, నరేష్, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: ఉద్ధవ్, కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: గోపీ సుందర్, నిర్మాత: బన్నీవాసు, రచన, దర్శకత్వం: మారుతి.


English summary
"How did I miss this… !!NameisNani in BBM is totally hilarious. The plot seems so interesting." Rajamouli tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu