»   » జక్కన్న పొగిడారు: ఇక ‘దృశ్యం’ సూపర్ హిట్టే...

జక్కన్న పొగిడారు: ఇక ‘దృశ్యం’ సూపర్ హిట్టే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి లాంటి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓ సినిమా చూసి బాగుంది అంటే....ప్రేక్షకుల్లో ఆ సినిమాపై మంచి అభిప్రాయం వెలువడటం సహజం. గతంలో రాజమౌలి చూసి బాగుందని పొగడ్తలు గుప్పించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా 'దృశ్యం' సినిమా చూసిన రాజమౌళి పొగడ్తల వర్షం కురిపించారు. కొంచె స్లోగా ఉన్నా...చాలా బాగుంది. వెంకటేష్ ఇరగదీసారు అంటూ ట్విట్ చేసారు.

విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీప్రియ దర్శకత్వంలో సురేష్ బాబు, రాజ్ కుమార్ ,సేతుపతి సంయుక్తంగా నిర్మించారు. వెంకీ పెర్ఫార్మెన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్, థ్రిల్లర్ కథాంశం తోడవడం సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది.

 Rajamouli tweet about Drishyam

సినిమా కథ విషయానికొస్తే...
తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.

సాధారణమైన కథకు భావోద్వేగపూరితమైన కథనం సమకూర్చిన 'దృశ్యం‌'...మళయాళి రీమేక్ అయినా యూనివర్శిల్ అప్పీల్ ఉన్న కథ కావటంతో ఇక్కడ ప్రేక్షకులను కట్టిపారేసింది. సరిగ్గా ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం...మౌత్ టాక్ తో మంచి విజయం సాధించే అవకాశం కనపడుతోంది.

English summary

 "Drishyam is a refreshing change over film.A bit slow to takeoff, but once it did, held me in a grip till the end. Venkateshgaru did a subtle" Rajamouli tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu